Health

డాక్టర్స్ రోజూ చికెన్ ను తినొద్దంటరు, ఎందుకో తెలుసుకోండి.

మన భారత దేశంలోనే కాదు.. విదేశాల్లో కూడా చికెన్ కు మంచి డిమాండ్ ఉంటుంది. రోజూ ఎంతో మంది చికెన్ ను తిటూంటారు. అయితే రోజూ వ్యాయామాలు చేసే వారికి చికెన్ తినాలని డైటీషియన్స్ సూచిస్తారు. డైటీషియన్స్ సూచనల ప్రకారం ఎంత తక్కువ క్వాంటీటీలో చికెన్ తీసుకున్నా.. అంత మంచిది కాదంటున్నారు నిపుణులు. అయితే చికెన్ ను ఇష్టపడనివారంటూ ఉండరు. చికెన్ ఫ్రై, చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ, చికెన్ 65 అంటూ ఎన్నో రకాలుగా చికెన్ ను తినొచ్చు. నిజానికి చికెన్ ను ఏ విధంగా తిన్నా అదిరిపోతుంది.

అంతేకాదు చికెన్ మన శరీరానికి కావాల్సిన పోషకాలను కూడా అందిస్తుంది. చికెన్ లో ప్రోటీన్, సెలీనియం, ఫాస్పరస్, నియాసిన్ వంటి ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. చికెన్ లో ప్రోటీన్లను తయారు చేయడానికి అవసరమైన అన్ని అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఈ ప్రోటీన్లు హార్మోన్లు, రోగనిరోధక కణాల ఉత్పత్తిలో సహాయపడతాయి. అలాగే ఇవి కండరాల పెరుగుదలను కూడా మెరుగుపరుస్తాయి. చికెన్ మన శరీరానికి కావాల్సిన పోషకాలను అందించినా.. దీన్ని రోజూ తినడం మంచిది కాదు. ఎందుకంటే దీన్ని ఎక్కువగా తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి.

చికెన్ ను ఎక్కువగా తినడం వల్ల మీరు విపరీతంగా బరువు పెరిగిపోతారు. అంతేకాదు గుండె జబ్బులు కూడా వస్తాయి. మీకు తెలుసా? మనం మన రోజువారీ కేలరీలను తీసుకోవడంలో ప్రోటీన్ 10 నుంచి 35 శాతం మాత్రమే ఉండాలి. ఇంతకంటే ఎక్కువ ప్రోటీన్ ను తీసుకుంటే మన శరీరం దానిని కొవ్వుగా నిల్వ చేస్తుంది. దీనివల్ల మీరు బరువు పెరుగుతారు. అలాగే మీ శరీరంలో కొలెస్ట్రాల్ కూడా బాగా పెరిగిపోతుంది. రెగ్యులర్ గా కోడి మాంసం తినడం వల్ల మీ శరీరంలో ప్రోటీన్లు పెరిగిపోతాయి.

ఎక్కువ ప్రోటీన్ అరగడం కష్టం. మీకు తెలుసా?చికెన్ ను ఎక్కువగా తినడం వల్ల మీ శరీరంలో కొలెస్ట్రాల్ లెవల్స్ బాగా పెరిగిపోతాయి. ఇది గండెపోటుతో పాటుగా ఇతర గుండె జబ్బులను కలిగిస్తుంది. ప్రోటీన్ ఎక్కువగా ఉండే చికెన్ లేదా ఇతర ఆహారాలను తినడం వల్ల గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చికెన్ వంటి జంతు ఆధారిత ప్రోటీన్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల మీరు బరువు తగ్గడం కష్టమవుతుంది.

శాకాహారులతో పోలిస్తే రోజూ కోడి మాంసం తినేవారిలో బీఎంఐ ఎక్కువగా ఉంటుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. చికెన్ సరిగ్గా ఉడకకపోతే దీనిలో సాల్మొనెల్లా లేదా క్యాంపిలోబాక్టర్ వంటి బ్యాక్టీరియా బయటకు రావొచ్చు. ఈ బ్యాక్టీరియా మన శరీరంపై చెడు ప్రభావాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే ఇవి ఎన్నో ప్రమాదకరమైన రోగాకలు దారితీస్తాయి. వృద్ధులు, పిల్లలు, గర్భిణీ స్త్రీలు వంటి బలహీనమైన వ్యక్తులు సరిగ్గా ఉడకని చికెన్ ను అసలే తినకూడదు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker