Health

దగ్గు, జలుబు ఉన్నప్పుడు ఈ పండ్లు తింటే ఏం అవుతుందో తెలుసా..?

శీతాకాలం వేడి, తేమతో కూడిన వాతావరణంలో జలుబు, దగ్గు సీజనల్ వ్యాధుల లక్షణాల నుండి ఉపశమనం కలిగించే కొన్ని ఆహారాలు మన వంటగదిలో సులభంగా లభించే పదార్థాలతో తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా దీర్ఘకాలిక దగ్గు, జలుబు కోసం హోమ్ రెమిడీస్ తీసుకుంటే..అవి శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో సహాయపడతాయి. అయితే చలి తీవ్రత రోజు రోజుకు పెరిగిపోతూనే ఉంది. దగ్గు, జలుబు, జ్వరం, గొంతునొప్పి వంటి సమస్యలతో బాధపడేవారి సంఖ్య ఈ సీజన్ లో పెరిగిపోతుంది.

కానీ దగ్గు, జలులు సమస్యలు అంత తొందరగా తగ్గవు. అంతేకాదు ఈ సీజన్ లో ఇన్ఫెక్షన్ కూడా ఎక్కువ రోజులు ఉంటుంది. అందుకే వీటిని తగ్గించుకోవడానికి చాలా మంది వివిధ ప్రయత్నాలు చేస్తుంటారు. ఏదేమైనా ఈ సమస్యలు మరీ ఎక్కువ కాకుండాచూసుకోవడం మంచిది. దగ్గు, జలుబు, కఫం వంటి సమస్యలు ఉన్నప్పుడు పండ్లును తినొచ్చా? లేదా?అన్న సందేహాలు చాలా మందికి వస్తుంటాయి. నిజానికి పండ్లను తినడం చాలా మంచిది. ఎందుకంటే వీటిలో ఎన్నో రకాల పోషకాలుంటాయి. ఇవి మనకున్న ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి.

అయితే దగ్గు, జలుబు ఉన్నప్పుడు పండ్లు తింటే కొందరికి దగ్గు, గొంతునొప్పి పెరుగుతాయి. అందుకే ఇలాంటి కొన్ని సమస్యలున్నప్పుడు వీటిని తినకూడని చాలా మంది అంటుంటారు. అయితే దగ్గు, జలుబు ఉన్నప్పుడు పండ్లను తినకూడదు అనడానికి స్పష్టమైన సమాధానం లేదు. ఎందుకంటే పండ్లు తింటే అందరికీ ఒకేలా ఉండదనేది వాస్తవం. నారింజ, కివీలు, ద్రాక్ష వంటి సిట్రస్ పండ్లు లేదా కొద్దిగా ఆమ్ల పండ్లు కొంతమందికి గొంతు నొప్పిని, దగ్గును కలిగిస్తాయి. కానీ చాలా మందికి పెద్దగా ఇబ్బందిని కలిగించవు.

అలాగే ఫ్రిజ్ లో ఉంచిన పండ్లను లేదా జ్యూస్ లను తాగితే కూడా దగ్గు, జలుబు సమస్యలు మరింత పెరుగుతాయి. అందుకే పండ్లను గానీ, పండ్ల రసాలను గానీ వీలైనంత వరకు గది ఉష్ణోగ్రత వద్దే తీసుకోవాలి. మీకు సిట్రస్ పండ్ల వల్ల ఇబ్బంది కలిగితే ఈ సమయంలో వాటిని తీసుకోకపోవడమే మంచిది. మీకు దగ్గు, జలుబు ఉన్నప్పుడు, గది ఉష్ణోగ్రత వద్ద ఉంచిన పండ్లను, ముఖ్యంగా ఆమ్లరహిత పండ్లను ఎక్కువగా తినడం మంచిది.

ఇతర వేరే సమస్యలేం లేకపోతే ఏ పండు అయినా తినొచ్చు. పండ్లు తినడం వల్ల శరీరానికి ఎప్పుడూ మంచే జరుగుతుంది. అలాగని వీటిని మరీ ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే పండ్లలో కూడా నేచురల్ షుగర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఈ తీపిని అతిగా తినడం కూడా మంచిది కాదు. ముఖ్యంగా మీరు డయాబెటిస్ పేషెంట్ అయితే. ఏదేమైనా.. డాక్టర్ సలహా తీసుకుని వాటిని పాటించడం మర్చిపోకండి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker