Health

పాప్‌కార్న్‌ అంటే ఇష్టంగా తింటున్నారా..? తొందరలోనే మీకు ఈ ప్రాణాంతక వ్యాధి రావచ్చు.

సినిమాలకు వెళ్లినప్పుడు పాప్ కార్న్‌ తింటారు. మొక్కజొన్న గింజలను కాస్త నూనెలో వేయించడం వల్ల పాప్ కార్న్ తయారవుతుంది. పాప్‌ కార్న్‌ రుచిగా ఉండడంతో పాటు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కానీ వీటిలో నెయ్యి, ఉప్పు మాత్రం వేయకూడదు. ఇలా వేసిన పాప్ కార్న్ లను తింటే మన ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉందట.అయితే మొక్కజొన్న పేలాలను ఎక్కువ తినేవారికి ప్రమాదకరమైన శ్వాసకోశ సమస్యలు రావచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. పాప్‌కార్న్‌ తినడం వల్ల ‘పాప్‌కార్న్ లంగ్‌’ అనే చాలా అరుదైన, తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధి వచ్చే అవకాశం ఉంది.

దీన్ని బ్రాంకియోలిటిస్ ఆబ్లిటెరాన్స్ అని కూడా పిలుస్తారు. ఊపిరితిత్తులలోని చిన్న శ్వాసనాళాల వాపు, మచ్చల ద్వారా ఈ వ్యాధిని గుర్తిస్తారు. ఈ సమస్య శ్వాసకోశ పనితీరును తీవ్రంగా దెబ్బతీస్తుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులకు దారితీస్తుంది. ఈ కేసులు అరుదుగా బయటపడుతున్నా, పాప్‌కార్న్ లంగ్‌ అనేది విభిన్న వర్గాలు, వయసుల వారిని ప్రభావితం చేయగలదు. ఊపిరితిత్తులు లేదా ఎముక మజ్జ మార్పిడి చేయించుకున్న వారికి ఈ సమస్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. పాప్‌కార్న్ లంగ్‌ అనే పదం డయాసిటైల్‌ నుంచి ఉద్భవించింది.

ఇది సాధారణంగా మైక్రోవేవ్ పాప్‌కార్న్‌లో ఉపయోగించే ఆర్టిఫిషియల్‌ బటర్‌ ఫ్లేవరింగ్‌. వీటిని వెన్న లేదా నూనెతో వండుతారు. వండే సమయంలో వివిధ రకాల హానికరమైన పదార్థాలు, కెమికల్స్‌కి గురికావడం వల్ల పాప్‌కార్న్ లంగ్ వ్యాధి రావచ్చు. పాప్‌కార్న్ లంగ్‌ లక్షణాలను ముందుగా గుర్తించడం, వీలైనంత త్వరగా వైద్య సహాయం పొందడం చాలా ముఖ్యం. సాధారణంగా హానికరమైన పదార్థాలు లేదా పొగకు గురైన తర్వాత 2 నుంచి 8 వారాల్లో లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD) మాదిరిగానే ఉంటాయి.

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, పొడి దగ్గు, ఫ్లూ లాంటి అనారోగ్యం, అధిక జ్వరం, వివరించలేని అలసట, బరువు తగ్గడం, గురక, కళ్ళు, ముక్కు, చర్మం, నోటి చికాకు వంటివి ఉండవచ్చు. రాత్రిపూట చెమటలు, చర్మంపై దద్దుర్లు వంటి సమస్యలు రావచ్చు. పాప్‌కార్న్ లంగ్‌ రావడానికి వివిధ కెమికల్స్‌, పదార్థాలు కారణంగా చెప్పవచ్చు. డయాసిటైల్‌తో పాటు, క్లోరిన్, అమ్మోనియా, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, ఫార్మాల్డిహైడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ వంటి కెమికల్స్‌ ఈ వ్యాధికి దోహదం చేస్తాయి.

ఈ పదార్థాలు సాధారణంగా మైక్రోవేవ్ పాప్‌కార్న్ ఫ్యాక్టరీల వంటి ఇండస్ట్రియల్ సెట్టింగ్స్‌లో, ఇ-సిగరెట్లు, ఫ్లేవర్డ్‌ కాఫీలో కనిపిస్తాయి. ఇ-సిగరెట్లు, వాటి రీఫిల్ లిక్విడ్స్‌లో డయాసిటైల్ ఉండవచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి. వీటితో వినియోగదారులకు పాప్‌కార్న్ లంగ్‌ ముప్పు ఎక్కువగా ఉంటుంది. పాప్‌కార్న్ లంగ్ న్యుమోనియా, బ్రోన్కైటిస్, వైరల్ ఇన్‌ఫెక్షన్లు, కొల్లాజెన్ వాస్కులర్ డిజీసెస్‌, రుమటాయిడ్ ఆర్థరైటిస్, తీవ్రమైన స్కిన్‌ పీలింగ్‌, స్టీవెన్స్-జాన్సన్ సిండ్రోమ్ వంటి వ్యాధులకు దారితీయవచ్చు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker