రోడ్డు పక్కన మీరు నోరూరించే స్ట్రీట్ ఫుడ్ తింటున్నారా..? మీ కాలేయానికి ముప్పు తప్పదు.

అసలు బయట చేస్తున్న ఫాస్ట్ ఫుడ్స్ దేనితో తయారు చేస్తారో తెలిస్తే వారు జన్మలో ఫాస్ట్ ఫుడ్స్ జోలికే వెళ్లరు. స్ట్రీట్ ఫుడ్స్ తినడానికి అస్సలు ఇష్టపడరు. ముఖ్యంగా హైదరాబాద్ వాసులు తమ బిజీ షెడ్యూల్ లో వంట చేసుకోవటం ఇబ్బంది గా భావించి ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లలో ఆహారాన్ని తింటూ ఉంటారు. అయితే ఇది డేంజర్ అని చెబుతున్నారు. అయితే మనదేశంలో ఎక్కడికి వెళ్ళినా వీధి అంగళ్ళలో రుచికరమైన వంటకాలు దర్శనమిస్తుంటాయి.
ఆకర్షణీయంగా ఉండే వీటిని తినేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. వేయించిన తినుబండారాలు, స్వీట్లు, ఇతర ఆహారాలు తినటానికి రుచికరంగానే ఉన్నా వాటి వల్ల కాలేయ పరమైన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధిక కొవ్వు పదార్ధాలతో కూడిన ఈ అనారోగ్యకరమైన ఆహారాలను తరచు తినటం వల్ల ఆరోగ్యపరమైన సమస్యలు ఉత్పన్నం అవుతాయి.
వీటి వల్ల కాలేయంలో అదనపు కొవ్వు చేరి నాన్ అల్కహాలిక్ ఫ్యాటీ లివర్ సమస్యకు దారితీస్తుంది. స్ట్రీట్ ఫుడ్స్ తయారు చేసే వారు ఆపదార్ధాలను వండేందుకు ఉపయోగించే నూనెను మళ్లీ మళ్లీ ఉపయోగించడం వంటి అనారోగ్యకరమైన వంట పద్ధతుల కారణంగా ఆహారంలో హానికరమైన ట్రాన్స్ ఫ్యాట్స్ స్థాయిలు పెరిగేలా చేస్తాయి. ఈ ట్రాన్స్ ఫ్యాట్‌లు హెపాటిక్ స్టీటోసిస్‌కు దారితీస్తాయి. దీనినే ఫ్యాటీ లివర్ అని పిలుస్తారు.
రుచికరంగా ఉంది కదా అని ఈ పదార్ధాలను అధిక మొత్తంలో తీసుకోవటం వల్ల ఎక్కువ ప్రమాదం కలుగుతుంది. దీని వల్ల శరీరంలో కేలరీలు పెరుగుతాయి. క్రమేపి బరువు పెరగటానికి దారితీస్తుంది. కాలేయ వ్యాధికి ఊబకాయం కూడా ఒక ప్రాథమిక కారణం. సంతృప్త కొవ్వుతో కూడిన ఆహారాలను తీసుకోవడం వలన చెడు LDL కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి మరియు గుండె జబ్బులు మరియు స్ట్రోక్‌కు దారితీసే ప్రమాదం ఉంటుంది.
అనుకుకోకుండా వీధి ఆహారాలను తినాల్సిన పరిస్ధితి ఏర్పడితే మితంగా తినటం చాలా ముఖ్యం. ఈ ఫుడ్స్ ను రోజువారీగా కాకుండా అప్పుడప్పుడు తినటం వల్ల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. అలాగే, వంట వండే పద్ధతులను పరిశీలించటం, వేయించిన, లేదా కాల్చిన వాటిని , ఆవిరిపై ఉడికించిన వాటిని ఎంచుకోవడం ఆరోగ్యకరమని గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా ఇలాంటి వాటి విషయంలో అవగాహన వలన కాలేయం సంబంధిత సమస్యలు దరిచేరకుండా చూసుకోవచ్చు.