News

ఎవరినైనా డార్లింగ్‌ అని పిలుస్తున్నారా..? మీకు మూడినట్టే. హైకోర్టు సంచలన తీర్పు.

డార్లింగ్ అని పిలవడం లైంగిక వేధింపుల కిందకే వస్తుందంటూ కలకత్తా హైకోర్టు స్పష్టం చేసింది. పరిచయం లేని అమ్మాయిలను డార్లింగ్ అని పిలవడం లైగింక వేధింపు కిందకే వొస్తుంది అంటూ కలకత్తా హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. డార్లింగ్ అని పిలిచిన వారిని 354ఏ, 509 కింద నిందుతులగా భావించొచ్చు అని హైకోర్టు పేర్కొంది. పూర్తీ వివరాలోకి వెళ్తే మనకు ఇష్టమైనవారిని డార్లింగ్ అని పిలవడం ఈ రోజుల్లో సర్వసాధారణం.

చిన్న పిల్లలనుంచి పెద్దవారి వరకూ ఎంతో ఇష్టమైన వారిని డార్లింగ్‌ అని పిలుస్తారు. ఇంతవరకూ ఓకే.. కానీ అప్పటి వరకూ పరిచయమే లేని వ్యక్తులను కూడా డార్లింగ్‌ అంటుంటారు కొందరు. అది తప్పంటోంది కలకత్తా కోర్టు. అసలు ఏం జరిగిందంటే.. కోల్ కతాలో దుర్గాపూజ సందర్భంగా బందోబస్తు కోసం మహిళా పోలీసులను కూడా నియమించారు. అయితే, ఓ వ్యక్తి మహిళా కానిస్టేబుల్ ను డార్లింగ్ అని పిలిచాడు.

దాంతో ఆ మహిళా పోలీసు సదరు వ్యక్తిపై మాయాబందర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఆ వ్యక్తిపై కేసు నమోదు చేసారు పోలీసులు. ఈ కేసు విచారణ సందర్భంగా కలకత్తా హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఏ మాత్రం పరిచయం లేకుండానే ఓ మహిళను డార్లింగ్ అని పిలవడం లైంగిక వేధింపు కిందికి వస్తుందని స్పష్టం చేసింది.

అలా పిలిచిన వారిని ఐపీసీ 354A, 509 సెక్షన్ల కింది విచారించవచ్చునని హైకోర్టు పేర్కొంది. పరిచయం లేని మహిళ పట్ల డార్లింగ్ అనే పదాన్ని ఉపయోగించడం అసభ్యత కిందికి వస్తుందని కలకత్తా హైకోర్టు ధర్మాసనం వివరించింది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker