ఇదే నా ఆఖరి వీడియో..! ఆత్మహత్య చేసుకోబోతున్నా..? సంచలనంగా మారిన ప్రముఖ నటి వీడియో.
కోట్ల మందిలో ఎవరికో ఒక్కరికి వెండితెరపై నటించే ఛాన్స్ దక్కుతుంది. కొంతమందికి మాత్రం స్టార్ డమ్ ఒకేసారి వస్తుంది. అయితే ఇండస్ట్రీలో వెండి తెరపై చూపించిన రంగులు నిజ జీవితంలో ఉండవని కొంతమంద నటీనటుల జీవితాలు చూస్తే అర్థమవుతుంది. ఆర్థికంగా దారుణమైన పరిస్థితులు ఎదుర్కొని ఆత్మహత్యలు చేసుకున్నవారు కూడా ఉన్నారు. తమిళ ఇండస్ట్రీలో ఓ నటి చేసిన వీడియో పోస్ట్ ఇప్పుడు సంచలనం రేపుతుంది.
ఆ నటి ఎవరో కాదు గతంలో పలు మార్లు తెరపైకి వచ్చిన విజయలక్ష్మి. ‘‘మీడియా మిత్రులకు నమస్కారం. ఫిబ్రవరి 29న నేను ఓ వీడియో విడుదల చేశా. నామ్ తమిళర్ కట్చి సమన్వయకర్త సీమాన్ నాతో మాట్లాడాలని, నాతో కలిసి జీవించాలని కోరా. నేను ఎంతో ఆవేదనతో ఆ వీడియో పంపించా. ఆత్మహత్య చేసుకుంటానని చెప్పా.
ఇప్పుడు మార్చి 5వ తేదీ పూర్తయింది. నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి మూడేళ్ల పాటు నాతో రహస్య జీవితాన్ని కొనసాగించారు. నా జీవితాన్ని నాశనం చేశారు. నన్ను నడిరోడ్డుపై వదిలేశారు. ఇప్పుడు నాకు ఎవరూ సహకరించడం లేదు. ఎవరైనా సహకరించినా వారిని తరిమికొడుతున్నారు. ఇప్పుడు కర్ణాటకలో జీవించలేని పరిస్థితుల్లో ఉన్నా.
ఇదే నా చివరి వీడియో. నేను ఆత్మహత్య చేసుకోబోతున్నా. కర్ణాటక పోలీసులు తదుపరి వార్త చెబుతారు. నా మరణంపై సీమాన్ వివరణ ఇవ్వాల్సి ఉంటుంది’’ అని ఆమె చెప్పారు.