కలలో పాము కనిపిస్తుందా..? మీకు తొందరలోనే ఏమవుతుందో తెలుసా..?
చాలామందికి కలలో పాములు కనిపిస్తూ ఉంటాయి. పాములు దగ్గరికి వచ్చినట్టు కలలు రావడమో, పాములు కాటేసి పోయినట్టు కలలు రావడమో, పాములు మంచం పై నుంచి కిందికి వెళ్లినట్టు కలలు రావడమో.. ఇలా రకరకాలుగా పాములకు సంబంధించిన కలలు వస్తాయి. అయితే మనుషులకు కలలు రావడం సహజం. కొన్ని మంచి కలలు, కొన్ని చెడు కలలు ఉంటాయి. అయితే కొన్నికొన్ని సార్లు పాములు కలలో కనిపిస్తుంటాయి. మీ కలలో ఎప్పుడైనా వచ్చాయా? ఇలా వస్తే ఓ రకమైన భయం పట్టుకుంటుంది.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఒక వ్యక్తికి పాము గురించి కలలు వచ్చినట్టైతే.. దాని అర్థం ఏమిటి? కలలో వచ్చే పాములు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. జ్యోతిష్యం ప్రకారం మీ కలలో ఎర్ర పాము వస్తే మంచిది. ఎర్రటి పాము మీ శక్తికి చిహ్నం. కలలో ఎర్రటి పామును చూడటం మీరు జీవితంలో మరింత బాధ్యత వహించాలని సూచన. మీరు చేసే పని గురించి మరింత జాగ్రత్తగా ఉండాలి. లక్ష్యాలపై ఎక్కువ దృష్టి పెట్టాలి. మీ కలలో నల్లటి పాము వస్తే, అది మీలోని అంతర్గత చీకటికి చిహ్నం. మీ పరిస్థితులు తీవ్రంగా ఉండొచ్చు. నిరాశ కూడా కావచ్చు.
కలలో నల్ల పామును చూడటం మీకు భవిష్యత్తులో వచ్చే ప్రమాదాల సూచన. కాబట్టి ఈ సమయంలో మీరు ఎక్కువగా సానుకూల అంశాలపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. మీ కలలో ఆకుపచ్చ పాములు వైద్యంతో సంబంధం కలిగి ఉంటాయి. మీ కలలో కనిపించే పాము ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటే, అది తాత్విక చికిత్స అని, లేత ఆకుపచ్చ రంగులో ఉంటే శారీరక చికిత్స అని అర్థం. ఇది మాత్రమే కాదు, కలలో ఆకుపచ్చ పామును చూడటం వ్యక్తిగత పెరుగుదల, ఆధ్యాత్మిక మేల్కొలుపు వైపు కదలికను కూడా సూచిస్తుంది.
పింక్ పాము కలలు కనడం సాధారణంగా ఆనందం, ప్రేమను సూచిస్తుంది. స్త్రీ శక్తులతో ఎక్కువగా ముడిపడి ఉంది. మీరు ప్రస్తుతం నిర్లక్ష్యం చేస్తున్న మహిళలకు ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు అనడానికి ఇది సంకేతం. మీ కలలో నీలం రంగు పామును చూడటం సాధారణంగా సానుకూల సంకేతం. ఇది మీ జీవితంలో ఏదో మంచి జరుగుతుందని సూచిస్తుంది. ఇది సృజనాత్మకత, తెలివితేటలకు కూడా చిహ్నం. కాబట్టి కలలో నీలం పాము కనిపిస్తే భయ పడకండి.
ఎలాంటి ఇబ్బందులు లేకుండా హాయిగా ఉండొచ్చు. జ్యోతిష్యం ప్రకారం, పసుపు రంగు పాము కనిపించినా.. సానుకూల సంకేతం. ఆనందంతో ముడిపడి ఉంటుంది. అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. పసుపు రంగు పామును చూస్తే సంతోషమే కానీ చివరికి కాస్త బాధగా అనిపిస్తుంది. తెల్లని పాము రహస్యాన్ని సూచిస్తుంది. భవిష్యత్తులో మీరు కొన్ని పెద్ద రహస్యాలను దాచిపెడతారని దీని అర్థం. మీరు ఎవరితోనూ పంచుకోవడానికి ఇష్టపడని రహస్యాన్ని కలిగి ఉన్నారని ఇది చెబుతుంది.