Health

ఆ విషయంలో భార్యాభర్తల గొడవలా..? ఇదిగో చక్కటి పరిష్కారం.

కమాండింగ్, డిమాండింగ్ నేచర్ రిలేషన్ ని నాశనం చేస్తుందని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అలాగే ఫైనాన్స్ విషయంలో మీ భాగస్వామి తన కోసం ఖర్చుచేసుకోవడానికి సరిగా అనుమతించకపోవడం, అతిగా కంట్రోల్ చేయడం సరైన ఆలోచన కాదు. దీనివల్ల మీ రిలేషన్ పై వ్యతిరేకత పెరుగుతుంది. అయితే ఏ బంధంలో అయినా సమస్యలు సాధారణం. కానీ డబ్బు సమస్యలే వివాహ బంధంలో గొడవలు రావడానికి ఒక ముఖ్య కారణం. సన్ ట్రస్ట్ వాళ్లు చేసిన సర్వేలో భార్యా భర్తల మధ్య గొడవలకు డబ్బే ముఖ్య కారణమని తేలింది.

ఇనిస్టిట్యూట్ ఫర్ డైవర్స్ ఫినాన్షియల్ అనాలిసిస్ చేసిన సర్వేలో కూడా విడాకులకు డబ్బు విషయాలే మూడో కారణమని తేలింది. దాదాపు 22 శాతం విడాకులకు డబ్బే కారణమట. అనుకోని ఖర్చులు, అదుపు లేని ఖర్చులు, తక్కువ జీతం.. వీటన్నింటి ప్రభావం దంపతుల బంధం మీద పడుతుంది. అందుకే కొన్ని మార్పులు చేసుకుంటే మీ ఆర్థిక సంబంధాలు మెరుగుపడతాయి. డబ్బు విషయంలో పాటించాల్సిన నియమాలు.. డబ్బు గురించి ఎలాంటి విషయాలు దాచిపెట్టకండి. మీకున్న లక్ష్యాల గురించి, మీ ప్రణాళిక గురించి స్పష్టంగా తెలియజేయండి.

దాపరికాలు వద్దు. మీకు డబ్బు విషయంలో వస్తున్న ఇబ్బందుల గురించి కూడా తెలియజేయండి. మీరే ముందుగా చెప్తే ఎలాంటి గొడవలు రావు. నెల ఖర్చులకు సంబంధించి ఒక బడ్జెట్ ఇద్దరూ కలిసి వేసుకోండి. ఇద్దరి సంపాదనను ఎలా ప్రణాళిక వేసుకోవాలో ఆలోచించండి. సమస్యలు రాకుండా ఖర్చులను బట్టి వాటిని మారుస్తూ ఉండండి. ఖర్చుల గురించి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. మీ ప్రణాళిక అవసరాలకు అనుగుణంగా ఉండాలి. మీ ఇద్దరికీ ఉన్న ఇష్టాలను బట్టి డబ్బును విభజించుకోండి. ట్రిప్, లోన్ కట్టడం, రిటైర్‌మెంట్ ప్లాన్.. ఇలా అన్నింటినీ లెక్కగట్టుకుని మీ ప్రణాళిక వేసుకోండి. దీని వల్ల ఒకరికొకరు జవాబుదారీగా ఉంటారు.

అత్యవసర ఖర్చులొచ్చినపుడు డబ్బు లేకపోవడం ముఖ్య సమస్య. అందుకే మీ జీతంలో కొంత శాతం తప్పకుండా అనుకోకుండా వచ్చే అవసరం కోసం పొదుపు చేయాలి. ఉన్నట్టుండి మీకు జీతం రావడం కష్టమవుతున్నా కూడా కనీసం మూడు నాలుగు నెలలు కుటుంబాన్ని నెట్టుకు రాగల పొదుపు ఉండేలా చూసుకోండి. వీలైతే దానికోసం ఒక ప్రత్యేక అకౌంట్ పెట్టుకోండి. మీ ప్రణాళికలో నెలవారీ కట్టాల్సిన ఈఎమ్ఐలు, లోన్ కి సంబంధించిన వడ్డీ ఇవన్నీ రావాలి. వాటిని క్రమం తప్పకుండా కట్టేయండి. ఒకేసారి మీమీద ఒత్తిడి పడదు.

డబ్బుల పొదుపు విషయంలో మీ భాగస్వామిని ప్రశంసించడం, తెలివిగా డబ్బును ప్రణాళిక వేస్తే మెచ్చుకోవడం చేయండి. చిన్న విజయాల్ని కూడా సానుకూల దృక్పతంతో వేడుకలా చేసుకోండి. మీ బంధం బలపడుతుంది. డబ్బును పొదుపు చేయడం అంటే దాచిపెట్టడం కాదు. దాన్నుంచి లాభాలు పొందగలగడం. అందుకే మీ డబ్బును లాభాల బాట పట్టించేందుకు సరైన నిపుణులను ఒకసారి కలవండి. మీ ఇద్దరూ కలిసి ఇన్వెస్ట్ చేయడం, ఇంకేదైనా సేవింగ్ స్కీమ్ గురించి నిర్ణయం తీసుకోండి. ఇద్దరూ కలిసి నిర్ణయం తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు రావు. ఏమైనా సమస్య వచ్చినా ఒకరినొకరు నిందించుకోరు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker