Health

ఉదయాన్నే రెండు రాగి ఇడ్లి తింటే చాలు, ఆ రోజంతా ఉచ్చాహంతో పని చేస్తారు.

ఎప్పుడు సాధారణ ఇడ్లీ తిని బోరుకొట్టిందా అయిదే ఇదిగో ఈ రాగి ఇడ్లీ ప్రయత్నించండి. చాలా టేస్టు ఉంటాయి. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారికి రాగులతో చేసిన వంటకాలు ఆరోగ్యం. అలాగని రోజూ రాగి జావ, రాగి ముద్ద తినడం బోరు కొడుతుంది. అలాంటి వారికి రాగి ఇడ్లీ ఉత్తమ ఎంపిక. కేవలం మధుమేహం ఉన్నవారికే కాదు, పిల్లలు, మహిళలు కూడా రాగి ఇడ్లీ తినడం వల్ల నీరసం దరిచేరదు. రోజంతా ఉత్సాహంగా ఉంటారు. అయితే రాగుల్లో పోషకాలు చాలా ఉంటాయి.

మధుమేహులకు కూడా ఇది చాలా మంచిది. రాగి అంబలే కాకుండా ఒకసారి రాగిపిండితో ఇడ్లీలు కూడా చేసుకుని చూడండి. రవ్వ, పెరుగుతో కలిపి చేయడం వల్ల వీటికి మంచి రుచి వస్తుంది. నూనె లేకుండా, పిండి పులియ బెట్టాల్సిన అవసరం లేకుండా వెంటనే చేసుకునే ఇడ్లీ ఇది. కావాల్సిన పదార్థాలు..1 కప్పు రాగి పిండి, 1 కప్పు సన్నం రవ్వ, తగినంత ఉప్పు, 1 కప్పు పెరుగు, 1 కప్పు నీళ్లు, పావు టీస్పూన్ బేకింగ్ సోడా. రాగి ఇడ్లీ తయారీ విధానం.. ముందుగా నూనె లేకుండా రవ్వను రెండు నిమిషాలు వేయించాలి.

పెద్ద గిన్నెలోకి రవ్వను తీసుకుని రాగిపిండిని కలుపుకోవాలి. ఉప్పు, పెరుగు కూడా కలుపుకోవాలి. పెరుగు చిక్కదనాన్ని బట్టి కొన్ని కొన్ని నీళ్లు పోసుకుంటూ పిండి కలుపుకోండి. ఈ పిండిని అరగంట పక్కకు పెట్టుకోండి. అరగంటయ్యాక, అవసరమైతే ఇంకొన్ని నీళ్లు పోసుకుని ఇడ్లీ పిండిలా కలుపుకోండి. ఆవిరి మీద ఇడ్లీ ఉడికించుకునే ముందు కొద్దిగా బేకింగ్ సోడా కూడా కలుపుకోండి. ఇడ్లీ కుక్కర్ లో ఇడ్లీ పాత్రలకి నూనె రాసి ఇడ్లీ పిండిని వేసుకోండి.

మామూలు ఇడ్లీ లాగే ఆవిరి మీద ఉడికించుకుంటే చాలు. రాగి పిండి ఇడ్లీలు సిద్ధం. వీటిని సాంబార్, చట్నీతో సర్వ్ చేసుకోండి. రాగులతో చాలా లాభాలు.. రాగులలో ఐరన్, క్యాల్షియం, ఫైబర్, ప్రొటీన్, అయోడిన్ పుష్కలంగా ఉంటాయి. ఇది సులభంగా జీర్ణమవుతుంది కాబట్టి ఎవరు తిన్నా మంచిదే. చిన్న పిల్లలకు కూడా పెడితే చాలా మంచిది. రాగుల్లో అమినోయాసిడ్స్ ఉంటాయి.ఇందులో ట్రిఫ్టోఫోన్ అనే అమినో యాసిడ్ ఆకలిని తగ్గిస్తుంది.

అందుకు రాగులను తినడం వల్ల బరువు కూడా తగ్గొచ్చు. దీనిలో ఇనుము అధికంగా ఉంటుంది. అందుకే ఇది తింటే రక్తహీనత సమస్య రాదు. మధుమేహం ఉన్నవారికి రాగులు చాలా మేలు చేస్తాయి. రాగితో చేసిన వంటకాలు వెంటనే రక్తంలో గ్లూకోజును వెంటనే విడుదల చేయదు. అందుకే డయాబెటిస్ ఉన్న వారికి ఇది మంచిది. అందుకే రాగులు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుందని చెబుతారు వైద్యులు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker