Health

మొటిమలు రాకుండా అందంగా ఉండాలంటే రోజుకు ఎన్నిసార్లు ముఖం కడగాలో తెలుసుకోండి.

మొటిమలు, నల్ల మచ్చలు, అలాగే మొటిమల వల్ల వచ్చే మచ్చలు ఇంకా అలాగే గుంతలు మన దరి చేరకుండా ఉండాలంటే మనం ఎల్లప్పుడూ కూడా ముఖాన్ని బాగా శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే ముఖంపై జిడ్డు పేరుకుపోకుండా చూసుకోవాలి. చాలా మంది కూడా తమ ముఖాన్ని శుభ్రంగా ఉంచుకోవడానికి స్క్రబర్ లను, ఫేస్ వాష్ లను వాడుతూ ఉంటారు. అందుకోసం చాలా ఖర్చు చేస్తూ ఉంటారు. అయితే ముఖ చర్మం సున్నితంగా ఉంటుంది. రోజువారీ పని, దుమ్ము, పొగ, చెమట కారణంగా ముఖంపై మురికి, ఆయిల్ తయరు అవుతుంది.

ఇది కడగకపోతే చికాకు, చర్మ సమస్యలను కలిగిస్తుంది. ముఖం కడుక్కోకపోతే జిడ్డు వల్ల చర్మం మురికిగా, పొడిబారిపోయి, డల్ గా కనిపించవచ్చు. వీటన్నింటి నుంచి బయటపడాలంటే రోజుకు కనీసం రెండుసార్లయినా ముఖం కడుక్కోవాలి. సున్నితమైన చర్మం ఉన్నవారు రోజుకు రెండుసార్లు ముఖం కడగాలని సిఫార్సు చేస్తారు. కొందరు చర్మవ్యాధి నిపుణులు రోజుకి ఒకసారి ముఖం కడుక్కోవాలని చెబుతున్నారు. ఇది మీ చర్మం రకం మీద కూడా ఆధారపడి ఉంటుంది.

మీకు పొడి లేదా సున్నితమైన చర్మం ఉన్నట్లయితే, మురికిని తొలగించడానికి మీరు రాత్రిపూట శుభ్రపరచవచ్చు. అలాగే ఉదయాన్నే గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. మీకు రోసేసియా లేదా తామర ఉంటే, చికాకును తగ్గించడానికి మీరు రోజుకు ఒకసారి, రాత్రికి ఒకసారి మీ ముఖాన్ని కడుక్కోవాలి. మీరు జిమ్‌కి వెళ్లినా, యోగా చేసినా లేదా బయట తిరిగి వచ్చినా, విపరీతంగా చెమటలు పడుతూ ఉంటే, మీరు మీ ముఖం కడుక్కోవాలి. మీ చర్మం రకం, మేకప్, మీ రోజువారీ కార్యకలాపాల ఆధారంగా ఫేస్ వాష్ పద్ధతిని అనుసరించాలి.

ఉదాహరణకు, మీరు మేకప్ వేసుకున్నట్లయితే, మీ ముఖం కడుక్కోవడానికి ముందు లిప్‌స్టిక్, ఐ మేకప్‌ను తొలగించండి. మేకప్‌లను ముందుగా మేకప్ రిమూవర్‌తో తొలగించి, ఆ తర్వాత మాత్రమే కింద పేర్కొన్న విధానాన్ని అనుసరించాలి. మీ ముఖాన్ని గోరువెచ్చని నీటితో తడిపేయాలి. మీ వేళ్లతో మీ నుదిటి, చెంపపై చిన్నగా రాయాలి. ముఖాన్ని 30 సెకన్ల పాటు కడుక్కోండి. తర్వాత శుభ్రమైన టవల్‌తో తుడుచుకోవాలి. చాలా మంది ముఖం కడుక్కోవడానికి సబ్బునే వాడతారు. ఇది మీ ముఖం తేమను కోల్పోయేలా చేస్తుంది. దురద, చర్మం చికాకును కూడా కలిగిస్తుంది. వీలైతే ముఖానికి ప్రత్యేకంగా తయారు చేసిన క్లెన్సర్ ఉపయోగించండి.

మీకు పొడి లేదా సున్నితమైన చర్మం ఉన్నట్లయితే సున్నితమైన లేదా నురుగుతో కూడిన క్లెన్సర్‌ని ఉపయోగించండి. మీ చర్మం డల్‌గా ఉంటే ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్ లేదా గ్లైకోలిక్ ఆధారిత క్లెన్సర్‌ని వాడండి. ఇది చర్మం ఉపరితలంపై ఉన్న మృతకణాలను తొలగించి చర్మానికి మెరుపునిస్తుంది. మీకు ముఖంలో మొటిమలు ఉంటే, ముఖాన్ని క్రమం తప్పకుండా కడగకపోతే మరింత అధ్వాన్నంగా మారవచ్చు. మొటిమలు ఉన్నవారు.. రెండు, మూడుసార్లు ముఖం కడుక్కోండి. మెుత్తానికి రోజుకు రెండు, మూడు సార్లు మాత్రమే ముఖం కడుక్కోవాలి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker