Health

మద్యం తాగే అలవాటు ఉన్నవారికే వచ్చే ప్రమాదకరమైన జబ్బులు ఇవే.

నీరు తాగడం అనేది ప్రతిరోజు ఎలా అయితే అలవాటుగా మార్చుకున్నారో.. ఇక మద్యం తాగడం విషయాన్నీ కూడా అలాగే అలవాటుగా మార్చుకున్నారు చాలామంది. అయితే ఒకప్పుడు మద్యం ఎక్కువగా తాగే వారిని కాస్త విచిత్రంగా చూసేవారు.. వారిపై తాగుబోతు అంటూ ముద్ర వేసి అతనితో సరిగా మాట్లాడే వారు కూడా కాదు.. కానీ ఇప్పుడు మాత్రం ఎవరైతే తాగకుండా మద్యానికి దూరంగా ఉంటారో వారిని విచిత్రంగా చూస్తున్నారు.

అంతేకాదు ఇలా మద్యం అలవాటు లేని వారితో సరిగా మాట్లాడుటం కూడా లేదు. అంతలా పరిస్థితులు మారిపోయాయి. అయితే ఆల్కహాల్ సేవించినా,తక్కువ మొత్తంలో సేవించినా రెండు సందర్భాల్లోనూ అది శరీరానికి చాలా హానికరం. ఇటీవల, WHO నివేదిక ప్రకారం, మద్యం ఎంత పరిమాణంలో తీసుకున్నా అది ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. దీనిపై సెలబ్రిటీ ఫిట్‌నెస్ ఎక్స్‌పర్ట్ రుజుతా దివేకర్ తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ మద్యం వల్ల కలిగే నష్టాలను వెల్లడించారు.

WHO నివేదిక ప్రకారం, ఆల్కహాల్ వినియోగం ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం పెరుగుతుంది. మద్యం సేవించటం వల్ల మిలియన్ల మంది ప్రజల వైకల్యాలు, అనారోగ్యం బారిన పడుతున్నారు. ప్రపంచ వ్యాధుల భారంలో 5.1% ఆల్కాహాల్ వినియోగం వల్లేనని తెలుస్తుంది. మగ , ఆడవారి వ్యాధుల భారంలో వరుసగా 7.1% మరియు 2.2% ఆల్కహాల్ యొక్క హానికరమైన వినియోగమే కారణంగా అధ్యయనాలు చెబుతున్నాయి. 15-49 సంవత్సరాల వయస్సు గల వారిలో అకాల మరణాలు , వైకల్యానికి ప్రధాన ప్రమాద కారకం ఆల్కహాల్.

ఈ వయస్సులో మొత్తం మరణాలలో 10% వాటా ఉంది. వెనుకబడిన జనాభాలో మద్యపాన సంబంధిత మరణాలు, ఆసుపత్రిలో చేరేవారు అధిక రేట్లు ఉన్నాయి. డబ్ల్యూహెచ్‌ఓ నివేదిక ప్రకారం మితంగా లేదా అధికంగా మద్యం సేవించడం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని చెప్పబడింది. పార్టీల సందర్భంలో మాత్రమే మద్యం సేవించినా , మితంగా తాగే వారైనా, మీకు లివర్ సిర్రోసిస్, వివిధ రకాల క్యాన్సర్, మానసిక ఆరోగ్యంపై ప్రభావం వంటి ప్రమాదాలు వచ్చే ప్రమాదం ఉంటుందని రుజుతా దివేకర్ హెచ్చరిస్తున్నారు.

అంతేకాకుండా అంటువ్యాధులతో పోరాడే రసాయనాలను విడుదల చేసే శరీర సామర్ధ్యానికి ఆల్కహాల్ దెబ్బతీస్తుంది. క్షయ, న్యుమోనియా వంటి వ్యాధులను తెచ్చిపెడుతుంది. గుండె సంబంధిత వ్యాదులు వచ్చే ప్రమాదం పొంచి ఉంటుంది. ప్యాంక్రియాస్ పై ప్రభావం చూపి జీవక్రియలను దెబ్బతీస్తుంది. బరువును పెరగటానికి దారి తీస్తుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker