మరణాన్ని ముందే ఊహించి రాకేష్ మాస్టర్ ఏం చేసాడో మీరే చుడండి.

వారం రోజుల క్రితం వైజాగ్ నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా.. ఆయన అస్వస్థతకు గురయ్యారు. అప్పటి నుంచి స్థానికంగా ఉన్న ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆదివారం ఉదయం రక్తపు వాంతులు, విరేచనాలు అవ్వడంతో.. పరిస్థితి విషమించింది. దీంతో మధ్యాహ్నం ఒంటిగంటకు ఆయన్ను గాంధీ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆయన్ను కాపాడేందుకు గాంధీ ఆస్పత్రి వైద్యులు విశ్వప్రయత్నం చేసినా.. ఫలితం దక్కలేదు.
అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ అకాల మరణం చిత్రపరిశ్రమకు షాక్కు గురిచేసింది. గత కొంతకాలంగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్న రాకేష్ మాస్టర్. ఆదివారం సాయంత్రం గాంధీ ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల ఓ ఈవెంట్ కోసం విశాఖపట్నం వెళ్లిన ఆయన కొద్దిరోజుల క్రితం హైదరాబాద్ వచ్చారు.
అదే సమయంలో సన్ స్ట్రోక్ రావడంతో.. రక్త విరోచనాలు, వాంతులు కావడంతో ఆయనను ఆదివారం మధ్యాహ్నం గాంధీ ఆసుపత్రి తరలించి చికిత్స అందించగా.. సాయంత్రం 5 గంటల సమయంలో పరిస్థతి విషమించి తుదిశ్వాస విడిచారు. రాకేష్ మాస్టర్ మృతి పట్ల అభిమానులు, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రాకేష్ మాస్టర్ కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది.
ఈ వీడియో చూసిన నెటిజన్స్.. అందులో తన చావును ఆయన ముందే ఊహించాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. ‘నా శరీరంలో మార్పులు వస్తున్నాయని నాకు తెలుసు. నేను అస్తమించే సూర్యుడిని.. నాకన్నీ తెలుసు’ ఆంటూ ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియోను చూస్తు బాధగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో దాదాపు 1500లకు పైగా చిత్రాలకు కొరియోగ్రాఫర్ గా పనిచేశారు రాకేష్ మాస్టర్.
ఆట, ఢీ వంటి షోలతో కెరీర్ ఆరభించిన ఆయన లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య, దేవదాసు వంటి చిత్రాలకు వర్క్ చేశారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్ ప్రారంభంలో ఆయనకు డాన్స్ లో శిక్షణ ఇచ్చింది కూడా రాకేష్ మాస్టరే. అందుకు సంబంధించిన ఫోటో కూడా వైరలవుతుంది.