Health

మీరు ఎన్ని నీళ్లు తాగినా మళ్లీ దాహం వేస్తోందా..? ఇది ఆ వ్యాధికి సంకేతం కావొచ్చు.

వ్యాయామం చేసిన తర్వాత ఇంకా మసాలాతో కూడిన ఆహారం తిన్న తర్వాత దాహం వేయడం సాధారణం. కానీ నిరంతరం దాహంగా ఉండటం లేదా నీరు త్రాగిన తర్వాత కూడా దాహం అనేది తీరకపోవడం వంటి లక్షణాలు అనేక అనారోగ్య సమస్యలకు సూచికలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే ప్రతి రోజూ సరిపడినన్ని నీళ్లు తాగాలని వైద్యులు సూచిస్తుంటారు. ఉదయం లేవగానే గోరువెచ్చని నీటిని రెండు గ్లాసులు తాగాలని చెబుతుంటారు.

ఆ తరువాత.. శరీర అవసరాన్ని బట్టి రోజులో 7 నుంచి 8 గ్లాసుల నీళ్లు తాగాలని సూచిస్తారు. అయితే, కొందరికి ఎన్ని నీళ్లు తాగినా దహంగానే ఉంటుంది. తరుచుగా నీళ్లు తాగాలనిపిస్తుంటుంది. నీళ్లు తాగడం మంచిదే కానీ, పదే పదే దహం వేయడంపై కొంచెం జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. లాలాజల గ్రంథుల పనితీరులోపం.. నోరు పొడిబారడం వల్ల ఎక్కువ నీరు తాగుతుంటారు.

మళ్లీ మళ్లీ దాహం అనిపించడానికి ప్రధాన కారణం నోరు పొడిబారడం. లాలాజల గ్రంథి తగినంత ద్రవాన్ని ఉత్పత్తి చేయనప్పుడు.. నోటిలో తేమ ఉండదు. ఫలితంగా నోరు ఆరిపోతుంటుంది. దాంతో మళ్లీ మళ్లీ దాహం అవుతుంది. ఒకవేళ మీరు కూడా ఇదే సమస్య ఎదుర్కొంటున్నట్లయితే.. నిర్లక్ష్యం చేయొద్దు, ఒకసారి వైద్యులను సంప్రదించి సమస్యను వివరించాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.

మధుమేహం.. మధుమేహం వల్ల కూడా అధిక దాహం అవుతుంటుంది. వాస్తవానికి అతిగా మద్యం సేవించడం వల్ల మధుమేహం వస్తుంది. శరీరంలోని మూత్రపిండాలు రక్తం కంటే ఎక్కువ చక్కెరను తీసుకున్నప్పుడు.. గ్లూకోజ్ మూత్రం ద్వారా బయటకు వెళుతుంది. దీనివల్ల ఎక్కువ మూత్ర విసర్జన చేస్తారు. దాంతో శరీరం డీహైడ్రేషన్‌గా మారుతుంది. మళ్లీ మళ్లీ దాహం వేస్తుంది. అజీర్తి సమస్య..జీర్ణవ్యవస్థలోని కొన్ని సమస్యలు కూడా అధిక దాహాన్ని కలిగిస్తాయి.

కొన్నిసార్లు చాలా స్పైసీ ఫుడ్ తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. దీనివల్ల ఎక్కువ నీరు తాగుతారు. విపరీతమైన చెమట..అధిక చెమట కారణంగా.. తరచుగా దాహం వేస్తుంది. అధిక చెమట వలన శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. దీంతో మళ్లీ మళ్లీ దాహం వేస్తుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker