Health

న‌ల్ల క్యారెట్‌ ని తరచూ తింటుంటే క్యాన్సర్‌కు చెక్‌ పెట్టొచ్చు.

న‌ల్లరంగు క్యారెట్లలో ఆంథోసైనిన్‌ అనే ప‌దార్థం ఉంటుంది. దానివల్ల వాటికి నల్ల రంగు వస్తుంది. ఈ ఆంథోసైనిన్ మ‌న శ‌రీరానికి క్యాన్సర్‌ కణాలతో పోరాడేందుకు కావాల్సిన శక్తిని ఇస్తుంది. ఆరెంజ్‌ క్యారెట్లలో ఉన్నట్టే న‌ల్ల రంగు క్యారెట్‌ల‌లో కూడా బీటా కెరాటిన్‌ ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది. కంటి కణాలకు రక్షణ క‌ల్పిస్తుంది. అయితే క్యారెట్‌తో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బరువు తగ్గడంలో అలాగే బరువు పెరగడంలో, రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో క్యారెట్లు ప్రముఖ పాత్రను పోషిస్తాయి.

అలాగే శరీరానికి కావలసిన అనేక రకాల పోషకాలు క్యారెట్ల నుంచి లభిస్తాయి. అయితే మనం తినే క్యారెట్లు ఆరెంజ్ రంగులో ఉంటాయి. కానీ క్యారెట్లు నలుపు రంగులో కూడా ఉంటాయని మీకు తెలుసా..? నిజంగానే నల్లగా కూడా ఉంటాయి. ఆరెంజ్ క్యారెట్ల కంటే ఎక్కువ మొత్తంలో పోషకాలు, ప్రయోజనాలును కలిగి ఉన్నాయి. ముఖ్యంగా ఇవి బరువు తగ్గడంలో, క్యాన్సర్‌ని నిరోధించడంలో ప్రయోజనకరంగా ఉంటాయి.

నల్ల క్యారెట్లను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు.. న‌ల్ల క్యారెట్లలో ఉండే ఆంథోసైనిన్‌ అనే ప‌దార్థం.. మ‌న శ‌రీరానికి క్యాన్సర్‌ కణాలతో పోరాడేందుకు కావాల్సిన శక్తిని ఇస్తుంది. ఆరెంజ్‌ క్యారెట్లలో ఉన్నట్టే న‌ల్ల రంగు క్యారెట్‌ల‌లో కూడా ఉండే బీటా కెరాటిన్‌.. మన కంటి చూపును మెరుగుపరిచి, కంటి కణాలకు రక్షణ క‌ల్పిస్తుంది.

న‌ల్ల క్యారెట్‌ల‌లో ఉండే పీచు పదార్థం ఆరోగ్యవంతమైన జీర్ణక్రియకు తోడ్పడుతుంది. వీటిని తినడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగవ్వడమేగాక శరీరంలోని కొవ్వు‌ తగ్గుతుంది. వ‌య‌సు మ‌ళ్లిన వారిని వేధించే ఆర్థరైటిస్ స‌మ‌స్యను కారెట్లలోని యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ, యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలు సరిష్కరిస్తాయి. మతిమరుపు స‌మ‌స్య ఉన్నవారు న‌ల్ల క్యారెట్‌లు తినడం మంచిది.

వీటిిని తినడం వల్ల మతిమరుపు సమస్య తొలగిపోవడమే కాక అల్జీమర్స్‌ ప్రభావాన్ని కూడా తగ్గిస్తాయి. విటమిన్ సీ ఉన్న కారణంగా ఇది తెల్ల రక్త కణాల సంఖ్యను పెంచడంతో పాటు, రోగ నిరోధక శక్తి ని మెరుగుపరుస్తుంది. నల్ల క్యారెట్ మలబద్ధకం, గ్యాస్, ఉబ్బరం, గుండెల్లో మంట, అలసట, విరేచనాలు వంటి వ్యాధులను నయం చేస్తుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker