Health

దాంపత్య , శృంగాన సమస్యలున్నవారికీ ఈ పొడి దివ్యఔషధం. ఎలా వాడలో తెలుసా..?

జాజికాయను పొడిగొట్టి, అతి స్వల్ప పరిమాణంలో వాడినట్లయితే, కొన్ని అనారోగ్యాలకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. తాంబూలంలో జాజికాయను వేసుకుని సేవిస్తే నోటి దుర్వాసనను పోగొడుతుంది. పంటిమీద నలుపునూ, గారను తొలగించి, పళ్ళు మెరిసేలా చేస్తుంది. పాలలో జాజికాయ పొడిని కలుపుని తాగితే గుండెల్లో నొప్పి, దడ తగ్గుతాయి. అయితే మనలో చాలామందికి జాజికాయ గురించి తెలిసే ఉంటుంది. ఎన్నో వేల సంవత్సరాల నుంచి అటు ఆయుర్వేదంలో, వంటలలోనూ ఉపయోగిస్తున్న జాజికాయతో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

ఇందుకలో ఉండే కాల్షియం, ఐరన్‌, మాంగనీస్‌, పొటాషియం తదితర పోషకాలతో శరీరానికి పొషణ, శక్తి లభిస్తాయి. తద్వారా మన ఆరోగ్యం కాపాడబడుతుంది. అయితే మితమైన పరిమాణంలో జాజికాయ పొడిని ఆహారంలో కలిపి తీసుకుంటే లెక్కలేనన్ని ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా దాంపత్య సమస్యలు, శృంగాన సమస్యలతో బాధపడేవారికి జాజికాయ ఒక వరమని నిపుణులు చెబుతున్నారు. జాజికాయలో ఉండే ‘మిరిస్టిసిన్’ మెదడు చురుగ్గా పనిచేసేందుకు సహకరిస్తుంది.

అంతేకాక అల్జీమర్స్ తాలూకు లక్షణాలను ఆలస్యం చేయడానికి జాజికాయ ఉపకరిస్తుంది. శరీరంలోని వ్యర్థ పదార్థాలను పూర్తిగా తొలగించే శక్తి జాజికాయకు ఉంటుంది. అలాగే జాజికాయ పొడిని సూప్‌లలో వేసి తీసుకుంటే విరేచనాలు, మలబద్దకం, గ్యాస్‌ తదితర జీర్ణసమస్యలు తగ్గుతాయి. అలాగే శరీరంలో ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి. జాజికాయల పొడిని నిత్యం తీసుకుంటే శరీరంలో కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది. రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది. దీంతో గుండె జబ్బులు కూడా రాకుండా ఉంటాయి.

జాజికాయ పొడిని తీసుకోవడం వల్ల దంత సమస్యలు పోతాయి. నోటి దుర్వాసన తగ్గుతుంది. లివర్‌, కిడ్నీల్లో పేరుకుపోయే వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. అలాగే నిద్రలేమితో బాధపడేవారు రాత్రి పూట భోజనంతో జాజికాయ పొడి తీసుకుంటే రోజూ రాత్రి చక్కగా నిద్ర పడుతుంది. జాజికాయ నూనె నొప్పులకు బాగా పనిచేస్తుంది. కీళ్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి. దాంపత్య సమస్యలను దూరం చేయడంలో దీనికి మరేది సాటిలేదు. సెక్స్‌ సామర్ధ్యాన్ని పెంచడమే కాకుండా వీర్యకణాలను వృద్ధి చేయడంలో సాయపడుతుంది.

పురుషుల్లో ఏర్పడే నపుంసకత్వం, శీఘ్ర స్కలనం వంటి లైంగిక సమస్యలను దూరం చేస్తుంది. స్త్రీలకు రుతుక్రమ సమయంలో ఏర్పడే నొప్పులను తగ్గిస్తుంది. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు తింటే ఎంతో ఉపయోగపడతుంది. జాజికాయ, శొంఠి అరగదీసి కణతలకు పట్టిస్తే మానసిక ఒత్తిడి, తలనొప్పి, మైగ్రేన్‌ వంటి వాటి నుంచి ఉపశమనం పొందవచ్చు. చెంచా తేనెలో చిటికెడు జాజికాయ పొడిని కలిపి పడుకునే ముందు తీసుకుంటే మంచి నిద్ర పడుతుంది. చికెన్‌ ఫాక్స్‌ ఉన్నవారు జాజికాయ, జీలకర్ర, శొంఠి పొడుల్ని భోజనానికి ముందు పావు స్పూన్‌ తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker