Life Style

డయాబెటీస్ పేషెంట్లు ఐస్ క్రీం తింటే ఏమవుతుందో తెలుసా..?

ఐస్ క్రీమ్ లు ఎక్కువగా తింటే బాడీలో కొలెస్ట్రాల్ , ట్రైగ్లిజరైడ్స్ లెవెల్స్ బాగా పెరిగిపోతాయి. ఓవర్ వెయిట్, అధిక రక్తపోటు సమస్యలున్న వారు ఐస్ క్రీమ్ లను తింటే హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందట. అధిక చక్కెరలు, కొవ్వులను ఎక్కువ మొత్తంలో తీసుకోవడం వల్ల మెమోరీ పవర్ తగ్గిపోయే అవకాశముందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే డయాబెటిస్ అనేది ఒక ప్రాణాంతక వ్యాధి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది దీనిబారిని పడుతున్నారు. ఇది ఒక అంటువ్యాధిలానే వ్యాపిస్తోంది. డయాబెటీస్ ఒక్కసారి వచ్చిందంటే ఇక అది పూర్తిగా తగ్గే ప్రసక్తే ఉండదు.

మనం చేయాల్సిందల్లా దానిని కంట్రోల్ లో ఉంచడమే. ఇందుకోసం డయాబెటీస్ పేషెంట్లు రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా జాగ్రత్తపడాలి. ఇందుకోసం ఫుడ్ విషయంలో కేర్ ఫుల్ గా ఉండాలి. ఎందుకంటే కొన్ని రకాల ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిలను అమాంతం పెంచేతాయి. ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు తీపి పదార్థాలు తినకుండా ఉండాలని చెబుతుంటారు. సిడిసి ప్రకారం.. యునైటెడ్ స్టేట్స్ లో 37 మిలియన్లకు పైగా ప్రజలు డయాబెటిస్ తో నివసిస్తున్నారు. సుమారు 100 మిలియన్ల అమెరికన్లకు ప్రీడయాబెటిస్ ఉంది. ఇకపోతే మందే ఇది ఎండాకాలం.

ఈ సీజన్ లో చల్లని కూల్ డ్రింక్స్ .. లేదా తీయగా, చల్లగా, టేస్టీగా ఉండే ఐస్ క్రీంను పక్కాగా తినాలనిపిస్తుంది. మందుతున్న ఎండలకు ఐస్ క్రీం ను తింటే శరీరం కాస్త చల్లబడుతుంది. ఐస్ క్రీంలో చక్కెర ఉంటుంది. మిగతా వాళ్ల సంగతి పక్కన పెడితే షుగర్ ఉండే ఐస్ క్రీం ను డయాబెటీస్ పేషెంట్లు తినొచ్చా? లేదా? అన్నఅనుమానాలు పక్కాగా పుట్టుకొస్తాయి. ఐస్ క్రీమ్ లో కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి. కాబట్టి దీన్ని తింటే బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయన్నది నిజం. అయినప్పటికీ.. ఐస్ క్రీం ను తక్కువగా తింటే రక్తంలో చక్కెర స్థాయిలు ఏం పెరగవని నిపుణులు చెబుతున్నారు.


డయాబెటిస్ పేషెంట్లు మూడు వారాలకు ఒకసారి ఒక చిన్న స్కూప్ ఐస్ క్రీం తినొచ్చు. అస్పర్టమే, మన్నిటోల్ లేదా సార్బిటాల్ కలిగిన ఐస్ క్రీములు ఇతర స్వీటెనర్ల కంటే రక్తంలో చక్కెర స్థాయిలను పెంచే అవకాశం తక్కువ. అలాగే ఐస్ క్రీమ్ లోని ప్రోటీన్, కొవ్వు రక్తంలో చక్కెర శోషణను మందగించడానికి సహాయపడుతుంది. డయాబెటిస్ ఉన్నవారు ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉన్న ఆహారాలను తింటే మంచిది.

ఐస్ క్రీం వంటి చక్కెర ఎక్కువగా ఉన్న ఆహారాలను ఎక్కువగా తినకూడదు. డయాబెటిస్ ఉంటే ఐస్ క్రీం ఎంచుకునేటప్పుడు కొన్ని విషయాలను గుర్తించుకోవాలి. చక్కెర, కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉన్న ఐస్ క్రీంను ఎంచుకోండి. ఎందుకంటే ఇది రక్తంలో చక్కెరను పెంచే అవకాశం ఉండదు. కొన్ని బ్రాండ్లు ఎరిథ్రిటాల్, మాంక్ ఫ్రూట్ లేదా స్టెవియా వంటి పోషకేతర స్వీటెనర్లతో తయారుచేస్తారు. ఇవి కొంతమందిలో జీర్ణ సమస్యలను కలిగిస్తాయి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker