రోజు ఒక ముక్క జామకాయ తింటే ఎన్ని లాభాలున్నాయో తెలుసా..?

జామపండ్లను తినడం వల్ల హార్మోన్ల హెచ్చుతగ్గులు, అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. జామ పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండె నాళాలకు రక్త ప్రసరణ సక్రమంగా అందేలా చేస్తాయి. విటమిన్లు పుష్కలంగా ఉండటం వల్ల వ్యాధి నిరోధక వ్యవస్థ పటిష్టం అవుతుంది. సీజనల్‌గా వచ్చే జలుబు, దగ్గు లాంటివి జామపళ్లు తింటుంటే మనల్ని బాధించవు. అయితే జామకాయ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ కాయలో బయటపారేయాల్సింది ఏదీ లేదు. దీనితొక్క, గింజలు కూడా ఆరోగ్యానికి మంచివే. జామకాయలు రెండు రంగుల్లో ఉంటాయి.
కొన్ని జామకాయల్లో లోపలి గుజ్జు తెలుపు రంగులో ఉంటే.. ఇంకొన్ని జామకాయల్లో గులాబీ రంగులో ఉంటుంది. ఏదేమైనా ఏ రంగు జామకాయను తిన్నా బోలెడు ఆరోగ్య ప్రయోజనాలను పొందుతామని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందులోనూ క్రమం తప్పకుండా జామకాయలను తింటే ఎంతో మంచి జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. విటమిన్ సి కి గొప్ప వనరులలో జామకాయలు ఒకటి. అవును నారింజ పండ్లలో ఉండే విటమిన్ సి కంటెంట్ కంటే జామ పండులో నాలుగు రెట్లు ఎక్కువ విటమిన్ సి ఉంటుంది.
విటమిన్ సి రోగనిరోధక శక్తిని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఇది సాధారణ అంటువ్యాధులు, వ్యాధికారకాల నుంచి మనల్ని రక్షిస్తుంది. అంతేకాదు ఇది మన కళ్ళను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.. జామకాయల్లో ఉండే లైకోపిన్, క్వెర్సెటిన్, విటమిన్ సి, ఇతర పాలీఫెనాల్స్ శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. ఇవి మన శరీరంలో క్యాన్సర్ కణాలు పెరగకుండా నిరోధిస్తాయి. జామ పండు ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. లైకోపీన్ ఎక్కువగా ఉన్నందున రొమ్ము క్యాన్సర్ పెరుగుదలను కూడా ఇది నిరోధిస్తుంది. డయాబెటిస్ ఫ్రెండ్లీ ఫ్రూట్.. జామకాయలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఈ పండులో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది.
ఈ కారణంగా జామకాయలు డయాబెటిస్ అభివృద్ధిని నిరోధిస్తాయి. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ చక్కెర స్థాయిలలో ఆకస్మిక పెరుగుదలను నిరోధిస్తుంది. ఇక ఫైబర్ కంటెంట్ చక్కెర స్థాయిలను బాగా నియంత్రిస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.. జామకాయ శరీరంలో సోడియం, పొటాషియం సమతుల్యతను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. జామకాయ రక్తపోటును కూడా నియంత్రిస్తుంది. జామకాయలు ట్రైగ్లిజరైడ్స్, చెడు కొలెస్ట్రాల్ (ఎల్డిఎల్) స్థాయిలను తగ్గించడానికి సహాయపడతాయి. ఇవి గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి.