Health

ఈ జంతువు పాలు తాగితే మద్యం కంటే రెండింతలు మత్తు ఎక్కుతుంది. ఒక్కసారి తాగితే..?

ఎవరైనా ఈ జంతువు పాలు తాగితే మత్తుగా ఉండిపోయేది. ఇది ఏ జంతువు అని ఆలోచిస్తున్నారు కదూ.. అది ఏనుగు. ఏనుగు పాలలో ఆల్కహాల్ ఎంత ఉందో తెలుసుకుందాం. పాలు తీసుకోవడం ఆహారంలో ముఖ్యమైన భాగం. ఇది మన శరీరానికి అవసరమైన పోషకాలను అందించడంలో సహాయపడుతుంది. పాలు తాగడానికి ఇష్టపడే వారు తరచుగా ఆవు లేదా గేదె పాలను తీసుకుంటారు. అయితే అలాగే పాలు తాగితే ఆరోగ్యానికి మంచిదన్న విషయం తెలిసిందే. పాలు తాగితే బలంగా, దృఢంగా ఉంటారు. అలాగే పాలలో అనేక రకాలు ఉంటాయి. ఆవు, మేక, గాడిద పాలు ఇలా చాలా ఉంటాయి.

అలాగే ఏనుగు పాల గురించి విన్నారా. ఏనుగు పాలల్లో బీర్, విస్కీ లేదా వైన్ కంటే ఎక్కువ శాతం ఆల్కహాల్ శాతం ఉంటుంది. ఈ ఏనుగు పాలు తాగడం వల్ల మత్తు రావడమే కాదు మూర్ఛ కూడా పోతారు. అంత ప్రమాదకరం ఏనుగు పాలు. ఆడ ఏనుగు పాలలో 60 శాతం ఆల్కహాల్ లెవల్స్ ఉంటాయి. చెరకును తింటాయి:- ఏనుగులకు చెరకు అంటే చాలా ఇష్టం. అవి తియ్యగా ఉంటాయి కాబట్టి తినడానికి ఇష్ట పడుతుంది. అందుకు ఏనుగు చెరకు ఎక్కడ కనిపించినా వదలవు. చెరకు తోటలపై కూడా దాడి చేస్తూ ఉంటాయి.

చెరకులో ఆల్కహాల్ ఫార్మింగ్ ఎలిమెంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అందుకే ఏనుగు పాలలో ఆల్కహాల్ శాతం ఎక్కువగా కనిపిస్తుంది. ఏనుగు పాలు తాగితే వెంటనే మూర్ఛ పోతారు:- ఏనుగు పాలు చాలా ప్రమాదకరం. ఏనుగు పాలు మనుషులు తాగడానికి పనికి రావు. ఏనుగు పాల్లలో బీటా కైసేన్ అనే రసాయనం ఉంటుంది. ఆఫ్రికన్ ఆడ ఏనుగుల్లో అధిక స్థాయిలో ఒలిగోశాచురైడ్లు, లాక్టోస్ వంటివి ఉంటాయి. కాబట్టి ఈ పాలను మనుషులు కొద్దిగా తాగినా.. వెంటనే మూర్ఛ పోతారని నిపుణులు చెబుతున్నారు.

ఉదర సమస్యలు తలెత్తుతాయి:- అంతే కాకుండా ఏనుగు పాలల్లో కార్బోహైడ్రేట్స్ కూడా అధిక పరిమాణంలో ఉంటాయి. వీటి కారణంగా ఉదర సమస్యలు తలెత్తుతాయి. కడుపులో నొప్పి, ఉబ్బరం, గ్యాస్, అజీర్తి, విరేచనాలు వంటి అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. సాధారణంగా ఒక ఏనుగుకు రోజుకు 150 కిలోల ఆహారం అవసరం. అందుకే ఏనుగులు రోజుకు 12 నుంచి 18 గంటలు గడ్డి, పండ్లు, ఆకులు వంటివి తింటాయి. కాబట్టి ఏనుగు శరీరంలో వివిధ రకాల రసాయనాలు కూడా ఉంటాయి.

అందుకే కేవలం మద్యం తాగితేనే కాదు.. అడవిలో ఉండే ఆడ ఏనుగు పాలు తాగితే.. బీర్ తాగిన దాని కంటే రెండు రెట్లు ఎక్కువగా మత్తు వస్తుంది. ఇది మూర్ఛకు కూడా దారి తీస్తుంది. కాగా ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మూడు రకాల ఏనుగులు మాత్రమే మనకు కనిపిస్తాయి. కానీ 5 మిలియన్ సంవత్సరాల క్రితం భూమిపై సుమారు 170 రకాల ఏనుగులు ఉండేవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker