Health

డెంగ్యూ జ్వరం మెదడుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసా..? ఈ లక్షణాలు కనిపిస్తే..!

డెంగ్యూ సమస్య వారంలో రోజుల్లో తగ్గుతుంది.. ఈ టైమ్‌లో బ్లడ్ ప్లేట్‌లెట్స్ రేటుని పెంచి, ట్యాక్సిన్స్‌ని బయటికి పంపడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఆయుర్వేదంలో డెంగ్యూకి 30కి పైగా మందులు ఉన్నాయి. సాధారణంగా ఆయుర్వేదంలో ఏదైనా ట్రీట్‌మెంట్ తీసుకుంటే ఆ ప్రభావం శరీరం మొత్తానికి మేలు జరుగుతుంది. అయితే డెంగ్యూ లక్షణాలు రోగుల్లో తీవ్ర స్థాయిలో కనిపించడంతో రోగులు ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. జ్వరం, తలనొప్పితో పాటు, శరీరంపై ఎర్రటి దద్దుర్లు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు.

కొన్ని సందర్భాల్లో డెంగ్యూ రోగుల మెదడుపై కూడా ప్రభావం చూపుతున్నట్లు తాజా పరిశోధనల్లో వెల్లడైంది. పబ్లిక్ హెల్త్ జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. డెంగ్యూ జ్వరం కారణంగా షాక్ సిండ్రోమ్‌తో బాధపడుతున్న రోగుల మెదడు ఈ జ్వరంతో ప్రభావితమైనట్లు జీఎస్‌వీఎంలో చేసిన అధ్యయనాల్లో బయటపడింది. దీంతో డెంగ్యూ రోగుల్లో పక్షవాతం లక్షణాలు కనిపిస్తున్నట్లు తెలిపారు. రోగులకు వారి లక్షణాలను బట్టి చికిత్స చేస్తున్నారు. శరీరంలోని వివిధ భాగాలను దెబ్బతీసే అనేక రకాల డెంగ్యూ జాతులు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు.

అయితే మెదడుపై దీని ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. మెదడుపై డెంగ్యూ ప్రభావం.. లక్షణాలు ఏమిటంటే..శరీరంలో డెంగ్యూ వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే ఏ అవయవమైనా దెబ్బతింటుందని సఫ్దర్‌జంగ్‌ ఆస్పత్రి సీనియర్‌ రెసిడెంట్‌ డాక్టర్‌ దీపక్‌ కుమార్‌ సుమన్‌ చెబుతున్నారు. కొంతమంది డెంగ్యూ రోగుల్లో బహుళ అవయవ వైఫల్యం సంభవిస్తుంది. దీని కారణంగా రోగులు మరణిస్తారు. డెంగ్యూ మెదడుపై కూడా ప్రభావం చూపుతుంది. మెదడుపై డెంగ్యూ ప్రభావాన్ని డెంగ్యూ ఎన్సెఫాలిటిస్ అంటారు.

డెంగ్యు వచ్చిన రోగి మెదడు ఉబ్బిపోతుంది. దాని కారణంగా అతను అపస్మారక స్థితికి చేరుకుంటాడు. ఈ సమస్య ఏ వయసులోనైనా రావచ్చు. అయితే మెదడుపై డెంగ్యూ ప్రభావానికి గల కారణాలు ఇంకా తెలియలేదు. డెంగ్యూకి ఇంట్లో స్వయంగా చికిత్స చేసుకోవడం వద్దు.. ఎయిమ్స్‌లోని మెడిసిన్ విభాగంలో డాక్టర్ నీరజ్ నిశ్చల్ డెంగ్యూ జ్వరానికి రోగులు స్వీయ చికిత్స చేయకూడదని హెచ్చరించారు. ఏదోఒక మందు వాడే ముందు వైద్యుడిని సంప్రదించడం చాలా అవసరం.

డెంగ్యూ వచ్చినప్పుడు శరీరంలో తగినన్ని నీళ్లు ఉండేలా చూసుకోవాలి. అంటే ఎల్లప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉండేలా జాగ్రత్త పడాలి. జ్వరం ఎక్కువగా ఉంటే పారాసెటమాల్ తీసుకోవచ్చు. కానీ ఇంటి వద్దనే ఉంటూ పూర్తి స్వయం చికిత్స తీసుకోకుండా వీలైనంత త్వరగా వైద్యుడిని సంప్రదించడం మర్చిపోకూడదు. డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు ఈ కింది లక్షణాలు కనిపిస్తాయి..100 డిగ్రీల కంటే ఎక్కువ జ్వరం, శరీరంపై ఎర్రటి దద్దుర్లు, తీవ్రమైన తలనొప్పి, వాంతులు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker