Health

మీ భాగస్వామితో మీ సంబంధాన్ని బలోపేతం కావాలంటే ఏం చెయ్యాలో తెలుసుకోండి.

భార్యాభర్తలు సంతోషంగా ఉండాలంటే పెద్దగా కష్టపడిపోవక్కర్లేదు. కొన్ని పనులు చేస్తే చాలు వైవాహిక జీవితం ఆనందంగా ముందుకు సాగుతుంది. ఏ బంధమైనా సరే మొదట్లో ఎంతో అందంగా ఉంటుంది. ఆనందంగా సాగుతుంది. కానీ కొన్ని జంటలు కాలం గడుస్తున్న కొద్దీ ఎక్కువగా గొడవ పడుతుంటాయి. గొడవలు, కొట్లాటలు లేని రిలేషన్ షిప్ ఉండదు. అందులోనూ చిన్న చిన్న గొడవల వల్ల వచ్చే నష్టమేమీ ఉండదు. అయితే భార్యాభార్తల బంధం విడాకుల వరకు వెళ్లకూడదంటే ఇద్దరూ కొన్ని పనులు చేయాలి.అయితే, బంధం దూరమవకుండా ఉండాలంటే.. రిలేషన్‌ స్ట్రాంగ్‌గా ఉండాలంటే.. చిన్న చిన్న విషయాల్లో పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

వీటిని పాటించడం వలన మీ బంధాన్ని మునుపటిలా, మంచిగా, దృఢంగా మారుతుంది. బహిరంగంగా మాట్లాడండి.. ఏదైనా సంబంధంలో నిజాయితీ, నిష్కాపట్యత చాలా ముఖ్యమైనవి. మీరు మీ భాగస్వామితో మాట్లాడినప్పుడల్లా, పూర్తిగా బహిరంగంగా మాట్లాడండి. అంటే మనస్ఫూర్తిగా, మనసులో ఏం అనుకుంటున్నారో అది క్లియర్‌గా మాట్లాడండి. సంభాషణ సమయంలో నిజాయితీగా ఉండండి. మీ భాగస్వామి సైతం మనసువిప్పి మాట్లాడే అవకాశం ఇవ్వండి. ఇది బంధాన్ని మరోసారి బలపరుస్తుంది. ప్రయత్నం ఆపవద్దు..సంబంధంలో విశ్వాసం, బంధం బలహీనపడిన తర్వాత దానిని తిరిగి స్థాపించడం చాలా కష్టం.

ఒకసారి నమ్మకం కోల్పోతే.. మళ్లీ త్వరగా నమ్మడం అంత సులభం కాదు. అయితే, నిరంతరం ప్రయత్నాలు చేస్తే విజయం సాధించవచ్చు. తద్వారా మీ బంధం మరోసారి బలపడుతుంది. పారదర్శకతను సృష్టించండి.. కొందరు తమ భాగస్వామికి తెలియకుండా కొన్ని పనులు చేస్తారు. అవి ఎదుటివారికి నచ్చకపోవచ్చు. లేదంటే.. అవి వారిలో ఆగ్రహం కలిగించొచ్చు. తద్వారా వారి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుతాయి. ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. తమకు చెప్పి ఉండాల్సింందని వారు భావిస్తారు. అందకే.. ఇలాంటి సమస్య రాకుండా.. బంధంలో పారదర్శకంగా ఉండే ప్రయత్నం చేయండి.

దాచే తప్పు చేయద్దు. ఒకవేళ ఇలాంటి తప్పు చేస్తే.. మనస్ఫూర్తిగా అంగీకరించి.. ఇంకెప్పుడూ ఇలాంటి పరిస్థితి రానివ్వనని భరోసా కల్పించాలి. తద్వారా మీ బంధం మరింత బలపడుతంది. క్షమాపణ చెప్పడానికి ఎందుకు వెనుకాడతారు..కొన్నిసార్లు చిన్న చిన్న మనస్పర్థల వల్ల బంధంలో గ్యాప్ ఏర్పడుతుంది. మీ భాగస్వామికి తెలియకుండా ఏమైనా చేసినా? మీరు చెప్పేది తెలియకపోయినా.. పొరపొచ్చాలు ఏర్పాడుతాయి. ఇద్దరి మధ్య గ్యాప్ ఏర్పడుతుంది. ఇలాంటి సమస్యను నివారించడానికి, గ్యాప్‌ను సరి చేయడానికి క్షమాపణలు చెప్పడం ఉత్తమ మార్గం.

క్షమాపణలు చెప్పే విషయంలో ఏమాత్రం ఆలస్యం చేయొద్దు. మీరు చేసిన పొరపాటుకు ఎంత త్వరగా క్షమాపణలు చెబితే.. అది అనుబంధాన్ని మళ్లీ బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. విశ్వసనీయతను పెంపొందించే ప్రయత్నం చేయండి..సంబంధంలో మీ వైపు నుండి ఏదైనా తప్పు జరిగి, అది మీ ఇద్దరి మధ్య దూరాన్ని పెంచినట్లయితే, మీ భాగస్వామికి మళ్లీ ఇది జరగదని గట్టి నమ్మకం కలిగేలా చెప్పండి. మీ భాగస్వామి మిమ్మల్ని విశ్వసిస్తున్నారని భరోసా ఇవ్వడం మీ బాధ్యత. ఇలాంటి ఈ సూచనలు పాటించడం ద్వారా మీ బంధం మరింత బలపడుతుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker