Health

ఆ పని తర్వాత ఇలా చేస్తే మీ ఆనందం రెట్టింపు అయ్యి, ఆరోగ్యంగా కూడా ఉంటారు.

శృంగార జీవితం సాఫీగా సాగిపోవాలంటే.. భాగస్వామి సహకారం కూడా ఉండాలి. అందుకే ముందు మీ భాగస్వామితో మనసు విప్పి మాట్లాడండి. మీ కోరికలను పంచుకోండి. వారి కోరికలు, ఇష్టాలు తెలుసుకండి. మీ క్రేజీ ఫాంటసీలు చెప్పి ఇంప్రెస్​ చేయండి. అయితే కడ్లింగ్ వల్ల ఇద్దరి మధ్య బంధం బలోపేతం అవడమే కాదు.. మానసిక, శారీరక ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది. మరింత అనుభూతి చెందవచ్చు. గట్టిగా కౌగిలించుకోవడం, తడమడం, కిస్ చేసుకోవడం, పరస్పరం మసాజ్ చేసుకోవడం, ముచ్చటించుకోవడం లాంటివన్నీ కడ్లింగ్ కిందికి వస్తాయి.

సెక్స్ చేసిన తర్వాత కడ్లిండ్ చేసుకోవడం వల్ల కొన్ని బెనెఫిట్స్ ఉన్నాయి. స్ట్రెస్ చాలా తగ్గుతుంది.
సాధారణంగా సెక్స్ చేస్తే చాలా మందికి చాలా రిలాక్స్‌గా అనిపిస్తుంది. అయితే, శృంగారం తర్వాత కడ్లింగ్ చేస్తే ఆక్సిటోసిన్ లెవెల్స్ శరీరంలో మరింత పెరుగుతాయి. దీనివల్ల ఒత్తిడి తగ్గుతుంది. అలాగే కడ్లింగ్ చేసుకుంటే.. మానసిక ఒత్తిడిని కలిగించే కార్టిసోల్ హార్మోన్ల లెవెల్స్ కూడా శరీరంలో తగ్గుతాయని కొన్ని అధ్యయనాలు తేల్చాయి.

అందుకే ఒకవేళ మీకు అధిక మానసిక ఒత్తిడి ఉంటే సెక్స్ తర్వాత పార్ట్‌నర్‌తో కడ్లింగ్ ట్రై చేయండి. గుండెకు మంచింది..సెక్స్ తర్వాత కడ్లింగ్ చేసుకుంటే బ్లడ్ ప్లజర్ లెవెల్స్ కూడా చాలా నియంత్రణలో ఉంటాయి. భాగస్వామిని ఎక్కువసార్లు హత్తుకోవడం ద్వారా రక్తపోటు నియంత్రణలో ఉంటుందని కొన్ని అధ్యయనాలు తేల్చాయి. దీంతో గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఆలింగనాల ద్వారా లవ్ హార్మోన్ ఆక్సిటోసిన్ కూడా ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. బంధం మరింత బలపడుతుంది..పార్ట్‌నర్‌తో సెక్స్ చేసి..

వెంటనే కడ్లింగ్ కొనసాగిస్తే ఇద్దరి మధ్య బంధం మరింత బలపడుతుంది. కడ్లింగ్ చేసుకుంటే వెలువడే ఆక్సిటోసిన్ ఇందుకు తోడ్పడుతుంది. దీన్ని అందుకే బాండింగ్ హర్మోన్ అని కూడా పిలుస్తారు. సెక్స్ తర్వాత మరింత అనుభూతి, ఆనందాన్ని పొందాలంటే కడ్లింగ్ చాలా ముఖ్యం. ఇది జీవిత భాగస్వాముల మధ్య సానుకూల బంధాన్ని ఇది పెంపొదిస్తుంది. రోగనిరోధక శక్తికి మేలు..శృంగారం తర్వాత కడ్లింగ్ చేసుకోవడం వల్ల ఆక్సిటోసిన్ హార్మోన్ మాత్రమే కాకుండా సెరోటిన్, డెపమైన్ కూడా పెరుగుతాయి.

ఈ మూడు హార్మోన్లు అధికమవడం వల్ల మనసుకు చాలా హాయి కలుగుతుంది. అలాగే, ఈ మూడు హార్మోన్లు కలిసి శరీరంలోని కొన్ని రకాల ఇన్ఫెక్షన్లను నిరోధిస్తాయి. రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. శరీరంలోని కణాల పనితీరును ఇంప్రూవ్ చేస్తాయి. నొప్పుల నుంచి ఉపశమనం..కడ్లింగ్ చేసుకోవడం ద్వారా కొన్ని రకాల శరీర నొప్పుల నుంచి కూడా తాత్కాలిక ఉపశమనం లభిస్తుందని కొన్ని అధ్యయనాలు తేల్చాయి. కడ్లింగ్ చేసుకున్న తర్వాత నిద్ర నాణ్యత కూడా మెరుగ్గా ఉంటుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker