News

ఇక్కడ ప్రతి ఒక్కరు రెండు పెళ్లిళ్లు చేసుకోవాల్సిందే, లేదంటే జైలు శిక్ష తప్పదు.

వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో కీలకమైన ఘట్టం. చనిపోయే వరకు గుర్తుంచుకునే మధురమైన జ్ఞాపకం. ఆ రోజు నుంచే లైఫ్‌లో కొత్త ప్రయాణం మొదవుతుంది. అందుకే వివాహ వేడుకను ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. ఐతే వివాహం సంప్రదాయాలు రాష్ట్రాన్ని, సామాజిక వర్గాన్ని బట్టి మారుతుంటాయి. అంతేకాదు వివాహ చట్టాలు కూడా వేర్వేరు దేశాల్లో వేర్వేరుగా ఉంటాయి. పాతకాలంలో బహు భార్యత్వ విధానం ఉండేది. అయితే భారతదేశంలో హిందూ సంప్రదాయం ప్రకారం ఒక వ్యక్తి ఒక వివాహం మాత్రమే చేసుకోవాలి. అంతకు మించి చేసుకుంటే.. శిక్షార్హులు అవుతారు.

మరిన్ని వార్తల కోసం www.manaarogyamkosam.com క్లిక్‌ చేయండి.

కానీ, ఈ దేశంలో మాత్రం పురుషులు రెండు వివాహాలు చేసుకోవాల్సిందే. ఒకవేళ అందుకు అంగీకరించకుంటే.. శిక్ష విధించే ఆస్కారం ఉంది. ఆఫ్రికన్ దేశమైన ఎరిట్రియాలో, పురుషులందరూ రెండుసార్లు వివాహం చేసుకోవాల్సిందే. లేదంటే అక్కడ వారికి జైలు శిక్ష విధిస్తారు. ఇందుకు సంబంధించి అక్కడి ప్రభుత్వం ప్రత్యేక చట్టం కూడా చేసింది. దీనిని అడ్డుకునేందుకు ప్రయత్నించే వారికి జీవిత ఖైదు కూడా విధించవచ్చు. మొదటి భార్య రెండో పెళ్లిని వ్యతిరేకిస్తే ఆమెకు కూడా శిక్ష పడుతుంది.

మరిన్ని వార్తల కోసం www.manaarogyamkosam.com క్లిక్‌ చేయండి.

ఎరిట్రియాలో పురుషుల సంఖ్య తక్కువగా ఉన్నందున ఈ వింత చట్టం రూపొందించడం జరిగిందట. ఇక్కడ పురుషుల కంటే మహిళల సంఖ్య రెండింతలు ఎక్కువ. అందుకే ఇక్కడ పురుషులు బలవంతంగా రెండు సార్లు పెళ్లి చేసుకుంటారు. ఎరిత్రియా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా విమర్శలకు గురైంది. ఈ దేశం ప్రపంచంలోని అతి తక్కువ అభివృద్ధి చెందిన దేశాలలో ఒకటి. అయితే, ఎరిట్రియా మినహా, చాలా దేశాలు వేర్వేరు నియమాలను కలిగి ఉన్నాయి.

మరిన్ని వార్తల కోసం www.manaarogyamkosam.com క్లిక్‌ చేయండి.

అదేవిధంగా ఐస్‌లాండ్‌లో కూడా అమ్మాయిలకు చాలా ఆకర్షణీయమైన వివాహ ఆఫర్లు ఇస్తారు. ఇక్కడ వివాహాలు చేసుకునే వారు చాలా తక్కువ. దాంతో అక్కడి ప్రభుత్వం వివాహం చేసుకునే వారికి రూ. 3 లక్షల ప్రోత్సాహకాలు కూడా అందిస్తుంది. బయటి వ్యక్తితో స్థానిక అమ్మాయి వివాహం చేసుకుంటే.. వారికి పౌరసత్వం కూడా ఇస్తోంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker