News

శివరాత్రి రోజున శివునికి ఈ వస్తువులను సమర్పిస్తే మీ జీవిత సమస్యలన్ని వెంటనే తొలిగిపోతాయి.

శివరాత్రి పర్వదినం నాడు శివునికి ఇష్టమైనటువంటి వస్తువులను సమర్పిస్తే మంచిదని చెబుతున్నారు. ఈరోజు శివయ్యకు పాలు సమర్పిస్తే, శివలింగానికి పాలతో అభిషేకం చేస్తే శాంతియుతమైన సామరస్యపూర్వకమైన జీవితం లభిస్తుందని చెబుతారు. పాలు స్వచ్ఛతకు ప్రతీక కాబట్టి, అటువంటి స్వచ్ఛమైన పాలను శివయ్యకు నివేదించాలని చెబుతారు. అయితే హిందువులు జరుపుకునే ప్రధాన పండుగలలో మహాశివరాత్రి ఒకటి. ఈ పర్వదినాన్ని ఈ ఏడాది మార్చి 8న జరుపుకోనున్నారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న శివాలయాలు శివనామ స్మరణతో మార్మోగుతాయి.

మరిన్ని వార్తల కోసం www.manaarogyamkosam.com క్లిక్‌ చేయండి.

ఈ పండుగ రోజున శివ భక్తులు పూజలు అభిషేకాలు చేస్తారు. అలాగే జీవితంలోని వివిధ సవాళ్లను అధిగమించడానికి ఈ శుభదినాన కొన్ని ఆచారాలు పాటించాలని చెబుతున్నారు. మహాశివరాత్రి నాడు చేసే పూజలు, పాటించే ఆచారాలతో వైవాహిక జీవితం, విద్య, వ్యాపారం, కాలసర్ప దోషాలకు సంబంధించిన సమస్యలను అధిగమించవచ్చని చెప్పారు. ఈ సమస్యలను పరిష్కరించడానికి ఏం చేయాలో ఆయన సూచించారు. పెళ్లి.. పెళ్లి కానివారు సరైన జంట కోసం చూస్తుంటే, వివాహ అవకాశాలను పెంచుకోవడానికి మహా శివరాత్రి మంచి సమయం.

మరిన్ని వార్తల కోసం www.manaarogyamkosam.com క్లిక్‌ చేయండి.

మంచి భార్య లేదా భర్తను పొందాలంటే ఈరోజు శివాలయానికి వెళ్లి కుంకుమ, పసుపు మిశ్రమాన్ని శివలింగానికి అర్పించాలి. ఇది దైవిక ఆశీర్వాదాలను ఆకర్షిస్తుంది, మ్యాచ్ అయ్యే పార్ట్‌నర్‌ను కనుగొనే అవకాశాలను మెరుగుపరుస్తుంది. విద్య..పవిత్రమైన మారేడు ఆకులపై గాయత్రీ మంత్రాన్ని రాసి, శివరాత్రి నాడు శివునికి సమర్పించాలి. దీంతో విద్యా పరంగా రాణించవచ్చని పండిట్ గిర్జేష్ సలహా ఇచ్చారు. మారేడు ఆకులు శివుడి మూడు కళ్లకు ప్రతీకగా నిలుస్తాయి.

మరిన్ని వార్తల కోసం www.manaarogyamkosam.com క్లిక్‌ చేయండి.

వ్యాపారం..వ్యాపారంలో ఇబ్బందులు ఎదురవుతుంటే, శివరాత్రి నాడు శివాలయానికి వెళ్లి పరమేశ్వరునికి శంఖం, కౌరీ గవ్వలు, పసుపు సమర్పించాలి. ఇవి వ్యాపార వెంచర్లకు శ్రేయస్సు, విజయాన్ని తెస్తాయని నమ్ముతారు. కాలసర్ప దోషం..కాలసర్ప దోషం అనేది రాహు, కేతువుల మధ్య అన్ని గ్రహాలు ఉండిపోయినప్పుడు సంభవించే ప్రతికూల పరిస్థితి. ఇది వ్యక్తుల జీవితంలో వివిధ అడ్డంకులు, అనర్థాలను కలిగిస్తుంది.

మరిన్ని వార్తల కోసం www.manaarogyamkosam.com క్లిక్‌ చేయండి.

శివుడిని ఆరాధించడం, శివాభిషేకం చేయడం వల్ల ఈ దోషం ప్రభావాలను తగ్గించవచ్చని పండిట్ గిర్జేష్ సూచించారు. శివలింగానికి నీరు, పాలు, తేనె, ఇతర పదార్ధాలతో శివుడిని ప్రసన్నం చేసుకునేందుకు శివాభిషేకం చేయాలని సలహా ఇచ్చారు. వెండి లేదా రాగి పాము ప్రతిమలను కొని, వాటిని శివాలయానికి విరాళంగా ఇవ్వాలని ఆయన తెలియజేశారు. పాములు శివునితో సంబంధం కలిగి ఉంటాయి, విశ్వ శక్తుల పై పరమేశ్వరుడి శక్తిని సూచిస్తాయి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker