Health

పాదాల నుంచి దుర్వాసన వస్తుందా..! మీరు వెంటనే ఏం చెయ్యాలంటే..?

పాదాల నుంచి వ‌చ్చే దుర్వాస‌న‌ను త‌రిమి కొట్ట‌డంలో లావెండర్ ఆయిల్ అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది. ఒక గిన్నెలో గోరు వెచ్చ‌ని నీటిని తీసుకుని అందులో పావు స్పూన్ లావెండ‌ర్ ఆయిల్‌ను వేసి మిక్స్ చేయాలి.ఇప్పుడు పాదాల‌ను ఆ నీటిలో కొంత స‌మ‌యం పాటు ఉంచి. ఆపై నార్మాల్ వాట‌ర్‌తో క్లీన్ చేసుకోవాలి.ఇలా చేస్తే పాదాల నుంచి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది. అయితే షూస్‌ నుంచి దుర్వాసన రావడం మీరు చూసి ఉంటారు.. కానీ కొంతమందికి పాదాల నుంచి దుర్వాసన వస్తుంది. దీనికి ఒక కారణం..

రోజూ షూస్‌ ధరించి.. ఆ బాక్టీరియా పాదలకు అంటుకోవడం, ఒంట్లోని చెమట కూడా అయి ఉండొచ్చు. షూస్‌ ధరించినప్పుడు మీ పాదాలకు చెమట ఎక్కువగా ఉత్పత్తి అయ్యి ఆ వాతావరణంలో బాక్టీరియా పెరుగుతుంది. దీంతో సహజంగానే పాదాల నుంచి దుర్వాసన వస్తుంది. షూస్‌ తీసేశాక కూడా ఆ దుర్వాసన అలాగే ఉంటుంది. అయితే కొన్ని సహజసిద్ధమైన చిట్కాలను పాటించడం వల్ల పాదాల నుంచి వచ్చే దుర్వాసనను తగ్గించుకోవచ్చు. బ్లాక్‌ టీలో ట్యానిక్‌ యాసిడ్లు ఉంటాయి. ఇవి దుర్వాసనను కలిగించే బాక్టీరియాను నాశనం చేస్తాయి.

దీంతో పాదాలకు సంరక్షణ లభిస్తుంది. అలాగే చెమట తక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి. ఒక పాత్రలో నీటిని తీసుకుని అందులో రెండు టీ బ్యాగ్స్‌ వేసి 15 నిమిషాల పాటు మరిగించండి. తరువాత బ్యాగ్స్‌ను తీసేసి అందులో మరింత నీటిని కలపాలి. కొంతసేపు ఆ మిశ్రమాన్ని అలాగే ఉంచాలి. అనంతరం ఆ నీటిలో పాదాలను 15-30 నిమిషాల పాటు ఉంచాలి. దీంతో పాదాల నుంచి వచ్చే దుర్వాసన తగ్గుతుంది. బాక్టీరియా నశిస్తుంది. పాదాలపై కొన్ని చుక్కల లావెండర్‌ ఆయిల్‌ వేసి సున్నితంగా మర్దనా చేయాలి. రాత్రి నిద్రపోయే ముందు.. ఇలా చేయండి.. దీంతో పాదాలపై ఉండే బాక్టీరియా నశిస్తుంది.

పాదాల నుంచి వచ్చే దుర్వాసనను తగ్గించేందుకు యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌ కూడా అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాదు పాదాలపై ఉండే బాక్టీరియాను ఈ వెనిగర్‌ నాశనం చేస్తుంది. ఒక బకెట్‌ గోరు వెచ్చని నీటిలో అర కప్పు యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌ వేసి బాగా కలపాలి. అనంతరం ఆ నీటిలో పాదాలను 10 నుంచి 15 నిమిషాల పాటు ఉంచాలి. దీని వల్ల బాక్టీరియా నశించి పాదాల నుంచి వచ్చే దుర్వాసన తగ్గుతుంది. షూస్‌ ధరించేటప్పుడు పాదాలపై కొద్దిగా మొక్కజొన్న పిండిని చల్లాలి. దీంతో చెమట తక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఉత్పన్నమయ్యే చెమటను ఆ పిండి పీల్చుకుంటుంది.

దీంతో పాదాలు పొడిగా ఉంటాయి. బాక్టీరియా పెరగకుండా ఉంటుంది. పాదాల నుంచి వచ్చే దుర్వాసన తగ్గుతుంది. కొద్దిగా చక్కెర, కొన్ని పుదీనా ఆకులు, కొద్దిగా నీరు వేసి ఆ మిశ్రమాన్ని మిక్సీలో వేసి పేస్ట్‌లా తయారు చేయాలి. దాన్ని పాదాలకు రాయండి. కొంత సేపటి తరువాత కడిగేయాలి. ఇలా రోజూ చేయడం వల్ల పాదాల చర్మం క్లీన్‌గా అవుతుంది.. చర్మంపై ఉండే మృతకణాలు తొలగిపోతాయి. ఒక బకెట్‌ గోరు వెచ్చని నీటిలో రెండు కప్పుల ఎప్సమ్‌ సాల్ట్‌ కలిపి ఆ నీటిలో పాదాలను 15 నిమిషాల పాటు ఉంచండి. ఇలా రోజూ చేయడం వల్ల పాదాల దుర్వాసన తగ్గుతుంది.

పాదాలపై బాక్టీరియా వృద్ధి చెందకుండా ఉంటుంది. బియ్యం నీటి ద్వారా కూడా పాదాలను క్లీన్‌ చేసుకోవచ్చు.. బియ్యం వాటర్‌తో మరికొన్ని నార్మల్‌ వాటర్‌ పోసి.. పాదాలను 10-15 నిమిషాల పాటు ఉంచాలి. పాదాల దుర్వాసన తగ్గుతుంది. వారంలో రెండు సార్లు ఇలా చేస్తే మంచి ప్రయోజనం ఉంటుంది. కొబ్బరినూనెలో లారిక్‌ యాసిడ్‌ ఉంటుంది. ఇది బాక్టీరియాను నాశనం చేస్తుంది. కొబ్బరినూనెతో పాదాలను 10-15 నిమిషాల పాటు మర్దనా చేయాలి. రాత్రి నిద్రకు ముందు ఇలా చేయండి… ఇలా రోజూ చేస్తే పాదాల దుర్వాసన సమస్య నుంచి బయట పడవచ్చు. పాదాలు సున్నితంగా అవుతాయి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker