Health

ఈ లక్షణాలు కనిపిస్తే మీ శరీరంలో ఇమ్యూనిటీ తక్కువ ఉన్నట్టే. వెంటనే ఏం చెయ్యాలంటే..?

మనిషికి సంక్రమించే వివిధ రకాల వ్యాధుల నుంచి కాపాడేది కూడా రోగనిరోధక వ్యవస్దే. శరీరంలో రోగనిరోధక శక్తి బలహీనమైతే తరచూ అనారోగ్యం వెంటాడుతుంటుంది. సూక్ష్మజీవులు లేదా టాక్సిన్‌ల కారణంగా ఏర్పడే హానికరమైన ప్రభావాల నుంచి మనల్ని రక్షించేందుకు శరీరం కలిగి ఉండే సామర్ద్యాన్ని రోగనిరోధక శక్తి అంటారు. రోగనిరోధక వ్యవస్ధ మన శరీరంలో వ్యాధులు రాకుండా కాపాడుతూ, ఒకవేళ వచ్చినా, వాటిని సమర్ధంగా పోరాడి ప్రారదోలే యంత్రాంగం.

అందుకే ప్రతి ఒక్కరూ రోగనిరోధ‌క శక్తిని పెంచుకోవ‌డం చాలా అవ‌స‌రం. అయితే ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం పై శ్రద్ధ ఎక్కువ పెడుతుంటారు. ఆరోగ్యం బాగుండాలంటే సరైన జీవన విధానాన్ని కచ్చితంగా అనుసరించాలి. చాలా మందిలో రోగ నిరోధక శక్తి చాలా తక్కువ ఉంటుంది. మీకు కూడా రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉందేమో అని సందేహం ఉందా..? అయితే ఈ లక్షణాల ద్వారా గుర్తించొచ్చు.

ఈ లక్షణాలు కనుక ఉంటే కచ్చితంగా రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నట్లే. మరి రోగ నిరోధక శక్తి తక్కువగా ఉందని ఎలా తెలుసుకోవచ్చు..? ఎలాంటి లక్షణాలు కనబడతాయి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. రోగ నిరోధక శక్తి కనుక తక్కువ ఉన్నట్లయితే ఎక్కువగా స్టొమక్ అప్సెట్ సమస్య కలుగుతుంది.

కడుపు లో ఇబ్బందులు ఉంటాయి. ఉదర సంబంధిత సమస్యలు ఇమ్యూనిటీ తక్కువ ఉంటే వ్యాపిస్తూ ఉంటాయి. పైగా జీర్ణం సరిగ్గా అవ్వదు. జీర్ణ సమస్యలు పదే పదే కలుగుతూ ఉంటాయి. తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవ్వదు దీంతో మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. అలానే రోగ నిరోధక శక్తి సరిగ్గా లేదంటే పింపుల్స్ కురుపులు వంటివి ఎక్కువగా కలిగి అవి తగ్గడానికి ఎక్కువ కాలం పడుతుంది.

ఇలా పడుతున్నట్లయితే కూడా రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నట్లు చెప్పొచ్చు. తరచూ జలుబు దగ్గు జ్వరం తల నొప్పి బలహీనత మొదలైన సమస్యలు మీరు ఎదుర్కొంటున్నట్లైతే కూడా రోగ నిరోధక శక్తి మీకు తక్కువ ఉందని చెప్పొచ్చు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker