News

శోభనం కంటే ముందు ప్రతి అమ్మాయిలు, అబ్బాయిలు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే.

నవ వధువుకి భర్తపై ప్రత్యేక ప్రేమ కలగాలంటే అతను మొదటి నుంచీ ఆత్మ విశ్వాసంతో కనిపించాలి. ప్రేమ అతని కళ్ళలో తొణికిసలాడుతూ ఉండాలి. చక్కటి సందర్భోచిత మాట తీరుతో ఆకట్టుకోవాలి. ఏ విషయానికి తొందరపడరాదు. దాంపత్య జీవితం అనేది తొలి రాత్రితోనే ముగిసిపోయేది కాదు కాబట్టీ.. ఆచితూచి అడుగులు వేయాలి. అయితే వెంటనే నిర్ణయానికి రావొద్దు.. పెళ్లికి ముందు అబ్బాయిలు, అమ్మాయిలు కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. ఎవరినైనా చూసిన వెంటనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయానికి రావొద్దు.

ఆకర్షణకు లోనై పెళ్లి చేసుకోవద్దు. వివాహం చేసుకోవాలనుకుంటే కొన్ని విషయాలపై శ్రద్ధ పెట్టాలి. తేడా గమనించాలి..సమాజంలో సంబంధాలు, అనుబంధాలు తాత్కాలికం లేదా అవసరాల వరకే అన్నట్లు మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏ వ్యక్తితో అయినా కొంతకాలం జీవించడం లేదా ఆ వ్యక్తితో జీవితాంతం గడపడం అనే తేడాగు గమనించాలి. కొంతకాలం రిలేషన్‌లో ఉండి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించు కోవడం అది అత్యంత చెత్త నిర్ణయం కావొచ్చు. అందుకే మీరు పెళ్లికి ముందు భాగస్వామిలో కొన్ని విషయాలను చెక్‌ చేయాలని ఎక్స్‌పర్ట్స్‌ సూచిస్తున్నారు.

అవి తనిఖీ చేయకపోవడం, సర్దుకుపోయే తత్వం తగ్గిపోవడంతో చాలా జంటలు విడిపోతున్నాయని పేర్కొంటున్నారు. ప్రవర్తన తెలుసుకోవాలి..మీ భాగస్వామికి మీకన్నా ఎక్కువ డబ్బు ఉంటే మీపట్ల ఎక్కువ ఆసక్తి, ఫీలింగ్‌ కనబర్చాలిన సవసరం లేదు. కొందరికి మొదటి నుంచి ఫీలింగ్స్‌ చూపించే అలవాటు ఉంటుంది. వాటిని గమనించాలి. అలాంటి వారు తమను ఎలివేట్‌ చేయడానికి చూస్తారు. భాగస్వామిని చులకనగా చూస్తారు. ఇక మరో చెడు అలవాటు అబద్ధాలు చెప్పడం. ఇది ఎవరికీ నచ్చదు.

మీ భాగస్వామి విషయంలో మీతో అబద్ధాలు చెప్పినా లేదా మీకు విషయాలు చెప్పకుండా దాచినా జాగ్రత్త పడాలి. భవిష్యత్‌లో అలాంటి వారు నమ్మకంగా ఉండరు. దీంతో బంధం బలహీనపడుతుంది. మీగురించి ఆలోచించడం..కొంతమందికి తమ గురించి మాట్లాడే అలవాటు ఉంటుంది. వారు ఏదైనా విషయంలో తమ అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. అలాంటి వ్యక్తికి మద్దతు ఇవ్వొద్దు. ఇలాంటి వాళ్లు సెల్ప్‌ డబ్బాకు ప్రాధాన్యం ఇస్తారు. వారికి దూరంగా ఉండడం మంచిది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker