News

పవన్ కళ్యాణ్ మూవీ చేయనని చెప్పిన శోభన్ బాబు. ఎందుకో తెలుసా..?

ఒక దశకు వచ్చాక శోభన్ బాబు ఇమేజ్ తగ్గింది. 80లలో ఆయన కెరీర్ పీక్స్ లో ఉంది. 90ల నాటికి తగ్గింది. 1996లో విడుదలైన హలో గురూ ఆయన చివరి చిత్రం. 2008లో శోభన్ బాబు మరణించారు. అంతకు ముందే ఆయనకు సిల్వర్ స్క్రీన్ కి దూరం అయ్యారు. కాగా పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ మూవీ సుస్వాగతం లో ఆయనకు ఆఫర్ వచ్చిందట. కానీ ఆయన రిజెక్ట్ చేశాడట. సుస్వాగతం చిత్రంలో పవన్ కళ్యాణ్ తండ్రి పాత్ర కీలకం కాగా శోభన్ బాబును అనుకున్నారట. ఆయన్ని సంప్రదించగా రిజెక్ట్ చేశాడట.

అందుకు ఆయన ఒక కారణం చెప్పాడట. అయితే పవన్ కెరీర్ లో ఇండస్ట్రీ హిట్స్ అందుకున్నాడు. వాటిలో సుస్వాగతం సినిమా ఒకటి. ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అందమైన ప్రేమకథతో పాటు చక్కటి మెసేజ్ తో వచ్చిన సుస్వాగతం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడిగా దేవయాని నటించారు.

ఈ సినిమాలో పాటలన్ని సూపర్ హిట్ గా నిలిచాయి. ఇప్పటికి కూడా సుస్వాగతం సినిమాలో పాటలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ సుస్వాగతం సినిమాలో పవన్ కు తండ్రిగా రఘువరన్ నటించారు. అయితే ఆయన పాత్ర కోసం ముందుగా ఎవరు గ్రీన్ హీరో, సోగ్గాడు శోభన్ బాబును అనుకున్నారట. అయితే అందుకు శోభన్ బాబు ఒప్పుకోలేదట. సుస్వాగతం సినిమా టైంకు శోభన్ బాబు కేరీర్ డౌన్ అయ్యింది.

కానీ ఆయన హీరోగా మాత్రమే సినిమాలు చేస్తానని తెలిపారట. తనతోటి నటులు క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా మారుతున్న టైంలో తాను మాత్రం హీరోగానే సినిమా చేస్తానని తెలిపారట. అదే టైం లో సుస్వాగతం సినిమాలో ఛాన్స్ వచ్చినా శోభన్ బాబు నో చెప్పారట. ఆతర్వాత ఆపాత్రను రఘువరన్ తో తెరకెక్కించారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker