మద్యంతో వేణుస్వామి డింపుల్ హయతి ప్రత్యేక పూజలు, పూజకి కారణం అదేనా..?
సినిమా రంగంలో బాగా రాణించాలనే… వేణు స్వామి తో ఇప్పటికే చాలామంది హీరోయిన్లు పూజలు కూడా చేయించుకున్నారు. అయితే ఈ హీరోయిన్ల లిస్టులో టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయాతి కూడా చేరిపోయింది. గత నెలలో తెలంగాణ ఐపీఎస్ ఆఫీసర్ తో డింపుల్ హయాతి గొడవ పెట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇదిలా ఉంటే కొంతమంది హీరోయిన్స్ ఆయనతో ప్రత్యేక పూజలు కూడా చేయించుకుంటూ ఉంటారు.
ఇప్పటికే నిధి అగర్వాల్, అషు రెడ్డి, ఇనయ సుల్తానాలాంటివారు వేణు స్వామితో ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. తాజాగా మరో ముద్దుగుమ్మ కూడా వేణు స్వామితో ప్రత్యేక పూజలు చేయించుకుంది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అంతా బాగానే ఉంది కానీ ఈ ఫోటోల పై నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.
డింపుల్ హయతి వేణు స్వామితో పూజలు చేయించుకున్న డింపుల్ హయతి పూజ మధ్యలో వైన్ బాటిల్ కనిపించడంతో నెటిజన్స్ ట్రోల్ చేస్తుంది. ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. అయితే వేణు స్వామి పూజలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. పూజలో తీర్ధం బదులు ఆయన మద్యాన్ని ఉంచుతారు. అయితే ఎవరు ఏది తాగితే అదే పూజలో ఉంచుతానని ఆయన తెలిపారు.
నేను చేసే వామాచార పూజలు బాగాలమ్మకు, రాజ శ్యామల, తార, చిన్నమస్త ఇలా ప్రతి ఒక్క పూజకు కూడా నేను లిక్కర్ నే వాడతాను. అలాగే తీర్ధంలో దాన్ని కలిపి ఇస్తాను అని చెప్పారు. మొత్తానికి ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.