News

జ్వరం వచ్చినా పొట్టకూటి కోసం ఇలాంటి పనులు తప్పడం లేదు : విష్ణు ప్రియా

సోషల్ మీడియా ద్వారా అభిమానులకు ఈజీగా రీచ్ కావొచ్చనే అభిప్రాయం చాలామంది సెలబ్రిటీల్లో నెలకొంది. అయితే కొంతమంది సెలబ్రిటీలు ఈ సోషల్ మీడియా ద్వారా తమ టాలెంట్‌ను బయటపెడుతున్నారు. సరిగ్గా ఇప్పుడు ఇదే పని చేసింది యాంకర్ విష్ణు ప్రియ. అయితే చాలా షోల్లో యాంకర్ గా కనిపించి విష్ణు ప్రియా తన అందంతోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంది. అలాగే ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ లోనూ పాల్గొంది ఈ అమ్మడు.

అంతే కాదు కొన్ని సినిమాల్లోనూ కనిపించింది విష్ణు ప్రియా. అయితే ఏమైందో ఏమో కానీ కొద్దిరోజులుగా విష్ణు ప్రియా సైలెంట్ అయ్యింది. టీవీ షోల్లో కానీ.. ప్రోగ్రామ్స్ లో కానీ ఎక్కడా కనిపించడం లేదు. ఆమె ఎందుకు షోలకు దూరంగా ఉంటుందా అని అభిమానులు ఆందోళ వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా విష్ణు ప్రియా సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసింది.

అనారోగ్యానికి గురయ్యాను కానీ పొట్టకూటికోసం తప్పడం లేదు అంటూ ఓ పోస్ట్ షేర్ చేసింది విష్ణు ప్రియా దాంతో ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ మేరకు విష్ణు ప్రియా ఇన్ స్టా స్టోరిలో ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ లో విష్ణుప్రియ తాను ఒంట్లో బాగోలేదని, జ్వరం వచ్చిందని, జలుబు కూడా చేసిందని చెప్పుకొచ్చింది. జ్వరం వచ్చిన , ఒంట్లో ఓపిక లేకున్నా పొట్టకూటికోసం తప్పడం లేదు.. డాన్స్ రిహార్సిల్స్ చేస్తున్నా అని రాసుకొచ్చింది విష్ణు ప్రియా.

ఈ పోస్ట్ పై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇక విష్ణు ప్రియా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రకరకాల ఫొటోలతో పాటు డాన్స్ వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది. అందాలతో కుర్రకారును కట్టిపడేస్తుంది ఈ భామ. టీవీ షోలతోనే కాదు ప్రైవేట్ సాంగ్స్ లోనూ కనిపిస్తూ ఆకట్టుకుంటింది విష్ణు ప్రియా.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker