News

తల్లి రాధిక పై వరలక్ష్మీ షాకింగ్ కామెంట్స్, ఆమె అస్సలు నా తల్లే కాదు అంటూ..?

వరలక్ష్మీ శరత్‌కుమార్ తమిళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు శరత్‌కుమార్ కూతురు. 2012లో వచ్చిన ‘బోడా బోడి’ సినిమాతో తమిళంలోకి అడుగుపెట్టిందామె. తరైతపట్టై, యశోద, మద గజ రాజా వంటి కొన్ని సినిమాల్లో నటించి తమిళ చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకుంది. అలాగే తెలుగులోనూ హనుమాన్, విక్రమ్ వేధ, రాయన్, యశోద, వీర సింహా రెడ్డి, సర్కార్, నాంది వంటి చాలా సినిమాల్లో నటిస్తూ, తన నటనతో ప్రేక్షకులకు దగ్గరైంది.

నటి వరలక్ష్మి తన చిరకాల ప్రియుడు నికోలాయ్ సచ్‌దేవ్‌తో పెళ్లికి సిద్ధమైంది. వారి నిశ్చితార్థ వేడుక ముంబయిలో సన్నిహితులు, కుటుంబ సభ్యులతో సాధారణ వ్యవహారంలా సాదాసీదాగా జరిగింది. అయితే ఆ విషయంలో చాలా చాలా లక్కీ ఫెలో వరలక్ష్మి శరత్ కుమార్ . కోలీవుడ్ స్టార్ యాక్టర్ శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి గురించి ఎంత చెప్పకున్నా తక్కువే.. పలు సినిమాలలో హీరోయిన్గా నటించింది. తెలుగు ఇండస్ట్రీలో లేడీ విలన్ గా బాగా క్రేజ్ సంపాదించుకుంది.

ఒక స్టార్ హీరోకి మించిన రేంజ్ లో అమ్మడు ఇప్పుడు దూసుకుపోతుంది అంటే కారణం ఆమెలో ఉన్న వైల్డ్ యాంగిల్ అనే చెప్పాలి రీసెంట్ గా ప్రియుడు తో నిశ్చితార్ధం చేసుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ తన సవతి తల్లి రాధిక గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఓ ఇంటర్వ్యూలో ఆమె ను హోస్ట్ “రాధికాతో మీ రిలేషన్షిప్ గురించి చెప్పండి ..?”అని అడగ్గా

..”అసలు ఆమె నా తల్లి కాదు ఒక ఫ్రెండ్ అందరూ అనుకుంటూ ఉంటారు సవతి తల్లి కదా .. ఏం బాగా చూసుకుంటుంది అని కాదు మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ ..తల్లి కూతుర్ల అస్సలు ఉండము” అంటూ సెన్సేషనల్ విషయాన్ని బయటపెట్టింది. ప్రెసెంట్ ఆమె మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker