Fish Venkat: వెంటిలేటర్‌పై తెలుగు కామెడీ విలన్ ఫిష్ వెంకట్, సాయం కోసం వేడుకుంటున్న భార్య.

Fish Venkat: వెంటిలేటర్‌పై తెలుగు కామెడీ విలన్ ఫిష్ వెంకట్, సాయం కోసం వేడుకుంటున్న భార్య.
Fish Venkat: ఫిష్ వెంకట్.. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో వెంటిలేటర్‌పై ఉంచి వైద్యం అందిస్తున్నారు. వెంకట్ కుటుంబం ప్రస్తుతం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. రెండున్నర దశాబ్దాలకుపైగా తెలుగు ఆడియెన్స్ ని అలరించిన ఫిష్ వెంకట్ చాలా రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఆయన కిడ్నీల సమస్యతో బాధపడుతున్నారు.

గతంలో కిడ్నీలు ఫెయిల్ కావడంతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. గతంలో కాస్త బెటర్ అయిన ఆయన ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు మళ్లీ సీరియస్‌గా మారింది. ప్రస్తుతం ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి మరింతగా క్షిణించినట్టు తెలుస్తోంది. కిడ్నీలు ఫెయిల్ కావడంతో తొమ్మిది నెలల క్రితమే డయాలసిస్ చికిత్స తీసుకున్నారు. దీంతో కాస్త బెటర్ అయ్యారు, కానీ ఇప్పుడు మరోసారి ఆయన ఆరోగ్యం క్షీణించిందట.
Also Read: Nagarjuna: నాగార్జున.. సమంతని కలిసే సీన్.
ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. ఆయన ఎవరినీ గుర్తు పట్టలేని స్థితిలో ఉండటం బాధాకరం. ఫిష్ వెంకట్‌కి ఆర్థిక ఇబ్బందులు..దీనికితోడు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు. చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయట. నిత్యం వైద్య ఖర్చులకు ఉన్నదంతా పెట్టినట్టు, ఇప్పుడు ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నట్టు తెలుస్తోంది.
Also Read: హీరోయిన్ సిమ్రాన్ ఎంత మంది హీరోలతో ఎఫైర్ నడిపించిందో తెలుసా..?
ఈ నేపథ్యంలో ఫిష్ వెంకట్ కుటుంబ సభ్యులు తమని ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఎవరైనా దాతలు తమకు సాయం చేయాలని ఫిష్ వెంకట్ భార్య, కూతురు వేడుకుంటున్నారు. వెంకట్‌కి డయాలసిస్ చేస్తున్నట్టు వారు వెల్లడించారు. ఎవరైనా ఆర్థిక సాయం చేస్తే మెరుగైన వైద్యం అందించడానికి వీలుంటుందని, ఆయన కోలుకునే అవకాశం ఉందని వారి కుటుంబ సభ్యులు చెబుతున్నారు.