News

ఆంధ్రప్రదేశ్ లో ఫుల్‌గా వర్షాలు, తీవ్రంగా హెచ్చరించిన వాతావరణశాఖ.

రానున్న రెండురోజుల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయి. ఈరోజు విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్‌, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, కడప జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

గడిచిన 24 గంటల వ్యవధిలో కోస్తా, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి. మిగిలిన ప్రాంతాల్లో ఎండ వేడిమి షరా మాములుగానే ఉంది. రెండ్రోజుల్లో మహరాష్ట్ర, తెలంగాణ, కర్నాటక, ఒడిశా, కోస్తాంధ్రల్లో భారీ వర్షాలు పడతాయి. ఉష్ణోగ్రత చూస్తే..తెలుగు రాష్ట్రాల్లో ఉదయం ఎండ ఉన్నా..మధ్యాహ్నం భారీ వర్షానికి చాన్స్‌ ఉంది. తెలంగాణలో పగటివేళ మాగ్జిమం 30 నుంచి 34 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఏపీలో మాగ్జిమం 32 నుంచి 38 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. తీరప్రాంతంలో వేడి ఎక్కువగా ఉంటుంది. ఈ నెల 15 నుంచి రుతుపవనాలు చురుకుదనాన్ని సంతరించుకొనున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది.

అదే సమయంలో ఇవి కోస్తాంధ్రలోని మిగిలిన ప్రాంతాలకు, ఒడిశా, వాయవ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతా­లకు విస్తరించనున్నాయి. ఫలితంగా ఈ నెల 15 నుంచి రాష్ట్రంలో విస్తారంగా వానలు కురవనున్నాయి. తెలంగాణ విషయానికివస్తే, అల్పపీడన ద్రోణి కారణంగా హైదరాబాద్‌సహా అనేక జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడన ద్రోణి బలపడటం వల్ల కరీంనగర్‌, సిరిసిల్ల, ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయి. హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షానికి చాన్స్‌ ఉంది.

ఉదయం వేళ్లల్లో ఎండ ఉన్నప్పటికీ..మధ్యాహ్నం వర్షం కురిసే అవకాశముంది. మేఘాల వల్ల ఉక్కపోత కూడా ఉంటుంది. ఇక ఏపీ విషయానికవస్తే.. విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, జిల్లాల్లో భారీ వర్షం పడనుంది. అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన వర్షం పడేటపుడు.. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు అప్రమత్తంగా ఉండాలి. చెట్లు, పోల్స్, టవర్స్ క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker