గంజి నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి తాగితే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా..?

ఆయుర్వేద శాస్త్రం ప్రకారం బియ్యం ద్వారా లభించే గంజిలో శరీరానికి అవసరమైన విటమిన్లు ఖనిజాలు ఎన్నో ఉన్నాయి.ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు మీ జుట్టుకు, చర్మ ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. అయితే గంజి నీటిని ఏ రకమైన బియ్యంతోనైనా తయారు చేసుకోవచ్చు, అయితే ఆయుర్వేద నిపుణులు మాత్రం ఎర్రబియ్యంను సిఫార్సు చేస్తున్నారు. బాయిల్డ్ రైస్, ముడి బియ్యం లేదా పాలిష్ చేయని బియ్యం ఉపయోగించకూడదు.
పొట్టు తీయని ఆర్గానిక్ బియ్యం వాడితే శ్రేయస్కరం అని చెబుతున్నారు. అలాగే బియ్యంను ఆవిరిలో ఉడికించకూడదు. పైన సూచించినట్లుగా తయారు చేస్తేనే మెరుగైన ప్రయోజనాలు పొందవచ్చు. రైస్ వాటర్ ఆరోగ్య ప్రయోజనాలు..ఈ గంజి నీరు చర్మం, జుట్టు కోసం అద్భుతమైన పోషణ అందిస్తుంది. చర్మాన్ని ప్రకాశంగా చేయడంలో, జుట్టు ఆరోగ్యంగా పెరగటంలో సహాయపడుతుంది.
ఈ గంజి నీటిని తాగటమే కాదు, దీనితో మీ ముఖం, జుట్టు శుభ్రం చేసుకోవచ్చు. ఈ గంజిలోని యాంటీఆక్సిడెంట్, మాయిశ్చరైజింగ్, UV నుంచి రక్షించే గుణాలు కూడా ఉన్నాయి. ఇవి చర్మంపై రంధ్రాలను బిగుతుగా చేస్తాయి, పిగ్మెంటేషన్, వయస్సు ప్రభావ మచ్చలను నివారిస్తాయి. వైట్ డిశ్చార్జ్ లేదా లుకోరియాతో బాధపడుతున్న ప్రతి మహిళ ఈ గంజి నీరు తాగితే సమస్య పరిష్కారం అవుతుంది.
గంజి నీరు ప్రకృతిలో చల్లగా ఉంటుంది. అందువల్ల ఇది మూత్రవిసర్జనలో మంట, విరేచనాలు, అధిక రక్తస్రావం, నెలసరి సమస్యలలో కూడా సహాయపడుతుంది. ఈ గంజి తాగితే అరచేతులు, అరికాళ్ళలో మంటను కూడా తగ్గిస్తుంది. గంజి నీటిలో అనేక ఖనిజాలు, విటమిన్లు ఉంటాయి, ఇందులో ‘ఇనోసిటాల్’ అనే సమ్మేళనం ఉంటుంది, ఇది కణాల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది, వృద్ధాప్య ప్రక్రియను ఆలస్యం చేస్తుంది, రక్త ప్రసరణను ప్రేరేపిస్తుంది.
ఈ గంజి నీరు సహజమైన ఎనర్జీ డ్రింక్ లా పనిచేస్తుంది. మీరు బలహీనంగా, నీరసంగా ఉన్నప్పుడు, అలసటగా అనిపిస్తున్నపుడు ఈ గంజి నీరు తాగితే తక్షణ శక్తి లభిస్తుంది. ఇది మీ ఎనర్జీ లెవల్స్‌ను పెంచడానికి సహజమైన పానీయం. ప్రతిరోజూ ఇలా గంజినీరు చేసుకొని తాగితే చాలా ఆరోగ్యకరం. అయితే ఇది ప్రకృతిలో చల్లగా ఉంటుంది కాబట్టి, ఇప్పటికే దగ్గు, జలుబుతో బాధపడేవారు తాగకూడదు.