Health

కాలేయాన్ని దెబ్బతీసే ప్రాణాంతక వ్యాధి, దీని లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా..?

హెపటైటిస్..వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల ఈ సమస్య వస్తుంది. ఐతే, వేరే ఇతర కారణాలు కూడా ఈ సమస్యకు దారితీయవచ్చు. మెడిసిన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్, టాక్సిన్స్, అలాగే ఆల్కహాల్ తో పాటు ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ వంటివి లివర్ ఇన్ఫ్లమేషన్ కు కారమవుతాయి. అయితే వాస్తవానికి ఈ వ్యాధికి ఇప్పటివరకు చికిత్స లేదు. అయితే రాకుండా నివారించవచ్చు. హెపటైటిస్ A, హెపటైటిస్ B రకాలను వ్యాక్సిన్ ద్వారా మాత్రమే నివారించవచ్చు, అయితే హెపటైటిస్ Cని ఆధునిక చికిత్స విధానాల ద్వారా 95 శాతం నయం చేయవచ్చు.

తీవ్రమైన హెపటైటిస్ లక్షణాలు ఎలా ఉంటాయో ఈ కింద తెలుసుకోండి. తీవ్రమైన హెపటైటిస్ లక్షణాలు.. జ్వరం, అలసట, ఆకలి లేకపోవడం, వికారం, వాంతులు, కడుపు నొప్పి, ముదురు రంగులో మూత్రం, లేత రంగులో మలం, కీళ్ల నొప్పి, కామెర్లు ఉంటాయి. మరోవైపు దీర్ఘకాలిక వైరల్ హెపటైటిస్ క్క లక్షణాలు అభివృద్ధి చెందడానికి దశాబ్దాలు పట్టవచ్చు. హెపటైటిస్‌ను అరికట్టడానికి, అలాగే మీ కాలేయాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి ఇక్కడ కొన్ని మార్గాలు ఉన్నాయి.

పరీక్షలు చేయించుకోండి.. బలహీనమైన రోగనిరోధక శక్తిని కలిగి ఉండి, తరచుగా అనారోగ్యం బారినపడుతుంటే ఆలస్యం చేయకూడదు. వీలైనంత త్వరగా హెపటైటిస్ పరీక్ష చేయించుకోవాలి. టీకాలు వేయించుకోవాలి..వివిధ రకాల హెపటైటిస్‌లకు వివిధ రకాల టీకాలు అందుబాటులో ఉన్నాయి. సరైన సమయంలో టీకాలు వేయించుకోవడం ద్వారా హెపటైటిస్ నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. 18 ఏళ్ల లోపు వారు, ఇప్పటివరకు టీకాలు వేసుకోని పెద్దలు కూడా తప్పనిసరిగా హెపటైటిస్ A, B కి వ్యతిరేకంగా టీకాలు వేసుకోవాలి.

ఆరోగ్యకరమైన ఆహారం తినండి..మీ కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి, మీరు పోషకాలు సమృద్ధిగా ఉన్న, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. రక్తాన్ని శుద్ధి చేసే ఆహారాన్ని తినాలి. వాల్‌నట్‌లు, బీట్‌రూట్‌లు, పసుపు, వెల్లుల్లి వంటివి ఆహారంలో చేర్చుకోవాలి. బాగా వండిన ఆహారాన్ని తినాలి. పచ్చిగా తినడం వల్ల హెపటైటిస్ వచ్చే అవకాశం ఉంది. కాచి చల్లార్చిన శుద్ధమైన నీరు త్రాగాలి. సురక్షితమైన శృంగార జీవనం..హెపటైటిస్‌ వైరస్ అనేది యోని స్రావాలు, లాలాజలం, వీర్యంలో కూడా జీవించగలదు.

కాబట్టి సురక్షితమైన సెక్స్‌ లైఫ్ కలిగి ఉండటం ద్వారా వైరల్ హెపటైటిస్‌ సంక్రమణను అరికట్టవచ్చు. పరిశుభ్రతను పాటించండి..హెపటైటిస్‌ వ్యాధి నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి వ్యక్తిగత పరిశుభ్రతను పాఠించడం చాలా ముఖ్యం. టూత్ బ్రష్, రేజర్లు, సూదులను ఇతరులతో పంచుకోవద్దు. టాయిలెట్‌కి వెళ్లిన ప్రతిసారీ, భోజనానికి ముందు, ఆ తర్వాత కూడా మీ చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. మీ పరిసరాలు శుభ్రంగా ఉంటే హెపటైటిస్ ప్రమాదాన్ని నివారించవచ్చు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker