అత్యంత శక్తివంతమైన కాయలు ఇవి, వీటి ఉపయోగాలు ఏంటో తెలుసా..?

ఈ మొక్కను తేలు కుండి, గొర్రె జిడ్డాకు మొక్క అని కూడా అంటారు. ఈ మొక్కలు మనకు విరివిరిగా కనిపిస్తాయి. ఈ గరుడ ముక్కు కాయలు ఎంతో శక్తివంతమైనవి. ఈ కాయలు గరుత్మంతుని ముక్కులాగా, నాగ పడగలాగా ఉంటాయి. పూర్వకాలంలో ఈ కాయలను ఇంటి సింహద్వారాలకు కట్టేవారు. అయితే దక్షిణ భారత దేశంలో ఏజెన్సీ ప్రాంతాల్లో కనిపించే ఈ మొక్కను గిరిజనలు అనేక రకాలుగా వాడతారు.. వాళ్లకు నచ్చినట్లు పిలుచుకుంటారు.
ఈ మొక్కను సంస్కృతంలో కాకంగి, కకనస అని.. సాధారణంగా ఈ చెట్టును గరుడ ముక్కు చెట్టు, గద్దాకు చెట్టు, తేలు కొండకు, తేలు కొండి చెట్టు, గొఱ్ఱె జిడ్డాకు వంటి రకరకాల పేర్లతో పిలుస్తారు. మధ్యప్రదేశ్ ఏజన్సీ ప్రాంతాల్లో గిరిజనులు ఈ మొక్క కాండాన్ని తాంత్రిక, వశీకరణ చర్యలకు ఉపయోగిస్తారు. ఈ చెట్టు ఆకులు రాత్రిపూట ఆకాశం వైపు చూస్తున్నట్లు ఉంటాయి. ఎన్నో ఔషధ గుణాలున్న ఈ చెట్టులో అద్భుత రహస్యాలు దాగి ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.
మొక్క వల్ల ఉపయోగాలు.. చర్మం దురదలకు, చర్మవ్యాధులకు ఈ నూనె మంచి ఔషధం. మూర్ఛ వ్యాధి రోగులకు గరుడ ముక్కకు మొక్క ఆకుల రసం అద్భుతంగా పనిచేస్తుంది. ఈ మొక్కల ఆకుల రసం నిద్రలేమికి.. క్షయ నివారణకు ఉపయోగిస్తారు. ఈ మొక్క ఆకుల రసాన్ని మెడకు రాయడం వల్ల క్షయ వ్యాధి తగ్గు ముఖం పడుతుంది. కీళ్ల నొప్పులు, తలనొప్పి, ఛాతి నొప్పి వ్యాధుల నివారణ కోసం.. ఈ మొక్క వేర్ల ఉపయోగించవచ్చు.
ఈ విత్తనాల నుంచి తీసిన నూనెను తెల్లజుట్టును నల్లగా మారుస్తుంది. యాంటీ వైపరిన్ లక్షణాల కారణంగా సాలెపురుగు , విష పురుగుల విషానికి విరుగుడుగా ఉపయోగిస్తారు. కాలిన గాయాలు త్వరగా తగ్గాలంటే.. పండ్లను కాల్చిన బూడిద, కొబ్బరి నూనెతో కలిపి ఆ మిశ్రమాన్ని కాలిన గాయాలపై అప్లై చేయాలి. తేలు విషాన్ని హరించడంలో ఈ ఆకుల రసం దివ్య ఔషధం.
తేలు కరిచిన చోట ఈ ఆకుల రసాన్ని వేసి కట్టుకడితే.. వెంటనే ఉపశమనం కలుగుతుంది. వేర్లను ఎండబెట్టి పొడిగా చేసుకోవాలి. ఒక టీ స్పూన్ పొడిని ఒక గాజు గ్లాస్ నీటిలో వేసి రాత్రంతా ఉంచాలి. ఈ నీటిని ఉదయమే తాగడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. నిపుణులు ఇచ్చిన సమాచారం మేరకే ఈ కథనం మీకు అందించడం జరిగింది. మనలోకం సొంతంగా రాసింది కాదని గమనించగలరు.