కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యని నిమిషాల్లో తగ్గించే ఇంటి చిట్కాలు.

సాధారణంగా తక్కువ తిన్నా కడుపు నిండినట్లు అనిపిస్తే దాన్ని కడుపు ఉబ్బరం సమస్యగా భావించవచ్చు. నిద్రలేమి సమస్య కూడా ఉబ్బరం, మలబద్ధకం సమస్యలకు కారణంగా నిలుస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే రోజుగా వేధించే ఈ సమస్యకు ఓ చిన్న చిట్కా ద్వారా దాదాపు పరిష్కారం లభిస్తుందంటే నమ్ముతారా? కానీ నిజం.. భోజనం చేసిన తర్వాత పాటించే చిన్న చిట్కాతో ఉబ్బరం, మలబద్ధకం సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
అయితే ఈ మధ్యకాలంలో చాలా మంది రకరకాల సమస్యలకు గురవుతున్నారు అందుకు కారణం ఆహారపు అలవాట్లే. మారిన ఆహారపు అలవాట్ల వలన కడుపు ఉబ్బరం వస్తోంది. కడుపు ఉబ్బరం సమస్య ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. ఎక్కువగా మనకి పడని ఆహార పదార్థాలని తీసుకున్నా లేదంటే ఏమి తినకపోయినా కూడా కడుపు ఉబ్బరం వస్తుంది.
గ్యాస్ట్రో ఇంటస్టినల్ ట్రాక్ లో గ్యాస్ ఏర్పడడంతో ఈ సమస్య వస్తుంది ఈ సమస్య నుండి బయట పడాలంటే చిన్న చిన్న చిట్కాలని ట్రై చేయొచ్చు అప్పుడు కచ్చితంగా సమస్య నుండి బయటపడడానికి అవుతుంది. కడుపు ఉబ్బరం ఉంటే పొత్తికడుపు ని సున్నితంగా మసాజ్ చేయండి ఇలా చేస్తే గ్యాస్ సులభంగా బయటికి వస్తుంది.
అలానే కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడు వేడినీళ్లతో స్నానం చేయండి. ఇది ఎంతో బెస్ట్ రెమిడీ వేడి నీటితో స్నానం చేస్తే ఉపశమనం లభిస్తుంది. కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడు నీళ్లు తీసుకోండి. నీరు తాగితే జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా మారుతుంది. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటే కూడా కడుపు ఉబ్బరం తగ్గుతుంది జీర్ణ ప్రక్రియ మెరుగుపడుతుంది కూడా.
కడుపు ఉబ్బరంగా ఉంటే చిన్న చిన్న వ్యాయామ పద్ధతుల్ని పాటించండి వాకింగ్ చేయడం వంటివి చేస్తే గ్యాస్ బయటకు వెళ్ళిపోతుంది. అరటి పండ్లను తీసుకుంటే కడుపు ఉబ్బరం నుండి రిలీఫ్ ని పొందొచ్చు. యోగ కూడా బాగా ఉపయోగపడుతుంది యోగ చేసినా కూడా ఈ సమస్య నుండి బయట పడొచ్చు.