గాయం తగిలినప్పుడు రక్తం గడ్డ కట్టడం లేదా..? మీరు ఎంత ప్రమాదంలో ఉన్నారో తెలుసుకోండి.
రక్తం గడ్డకట్టకముందు గడ్డకట్టించే ద్రవపదార్థాన్ని ప్లాస్మా అంటారు. ఇది లేత పసుపు రంగులో ఉంటుంది. ప్లాస్మాలో 90 శాతం నీరు ఉంటుంది. ప్లాస్మా రక్తంలో 60 శాతం ఉంటుంది. ప్లాస్మాలో ప్రతిరక్షకాలు ఆల్బిమిన్లు, గ్లోబ్యులిన్స్ అనే ప్రొటీన్‌లు ఉంటాయి. రక్తం గడ్డకట్టకుండా రక్తనాళాల్లో తోడ్పడే, ఉపయోగపడే పదార్థం ‘హిపారిన్’. రక్తం గడ్డకట్టిన తర్వాత తేలియాడే ద్రవపదార్థం ‘సీరం’. సీరం కూడా లేత పసుపు రంగులో ఉంటుంది.
దీనిలో ఎలాంటి ప్రొటీన్స్ ఉండవు. ప్రతిరక్షకాలు కూడా ఉండవు. అయితే ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే అన్ని రకాల విటమిన్లు, మినరల్స్, పోషకాలు అవసరం. ముఖ్యంగా విటమిన్ ఎ, బి, సి, డిలతోపాటు విటమిన్ కె కూడా మన శరీరానికి చాలా అవసరం. విటమిన్ K ప్రధానంగా రక్తం గడ్డకట్టడంలో సహాయపడుతుంది. అలాగే కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడేవారు త్వరగా కోలుకోవడానికి సహాయపడుతుంది.
అలాగే విటమిన్ K2 బలమైన ఎముకలను నిర్మించడంలోనూ సహాయపడుతుంది. విటమిన్ K శరీరంలో ఊపిరితిత్తుల పనితీరుతో సంబంధం కలిగి ఉంటుంది. అందువల్లనే విటమిన్ కె లోపం ఏర్పడినప్పుడు ముకల ఆరోగ్యంతో పాటు ఆస్తమా, సీఓపీడీ వంటి మొదలైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. విటమిన్ కె ఎముక ఆరోగ్యానికి, కాలేయ వ్యాధుల నివారణ, రక్తం గడ్డకట్టడానికి మాత్రమే కాకుండా.. ఎముకల పనితీరును కూడా క్రమబద్ధీకరిస్తాయి.
కాబట్టి మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే విటమిన్ కె లోపం ఉన్నట్లు అర్ధం. విటమిన్ K లోపం ఉన్న వారి ఎముకలు చిన్న గాయానికే విపరీతంగా దెబ్బతింటాయి. ఒక్కోసారి ఎముకలు విరిగిపోతాయి కూడా. సాధారణంగా విటమిన్ కె లోపం బోలు ఎముకల వ్యాధికి దారితీస్తుంది. చర్మంపై నీలిరంగు మచ్చలు కనిపించినట్లయితే మీ శరీరంలో విటమిన్ K లోపం ఉందని గ్రహించాలి. గుండె వేగం కూడా అకస్మాత్తుగా పెరుగుతుంది.
శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా మారుతుంది. ఋతుస్రావం సమయంలో స్త్రీలకు పొత్తి కడుపు భాగంలో విపరీతమైన నొప్పి ఉంటే విటమిన్ K లోపం ఉన్నట్లు అర్ధం. అలాగే ఈ విటమిన్ లోపం వల్ల ముక్కులో రక్తస్రావం కూడా అవుతుంది.