ఈ సీజన్ లో దొరికే వెలగపండు ఖచ్చితంగా తినాలి. ఈ పండులో ఉన్న ఔషధ గుణాలు తెలిస్తే..?

టేసి కుంటుంబానికి చెందిన వెలగ పండును ‘ఎలిఫెంట్ యాపిల్ ‘లేక ‘ ఉడ్ యాపిల్ అని కూడా పిలుస్తారు. వగరు, పులుపు , వగరు కలగలిపిన రుచి ఉన్న ఈ వెలగపండుని గోదావరి జిల్లాలో కొంతమంది పచ్చడిగా చేసుకుని తింటారు. ఆయితే ఎక్కువమంది ఈ వెలగపండుని తినడగానికి అంతగా ఇష్టపడరని చెప్పవచ్చు. అయితే వెలగ పండు.. దీని గురించి అందరికీ తెలుసు. వినాయక చవితి వచ్చిందంటే ఈ పండ్లన్నీ ఒక్కసారిగా దర్శనమిస్తాయి.
ఈ వెలగ పండు అంటే గణేషుడికి ఎంతో ఇష్టమట. అందుకే ఏ పండ్లు పెట్టినా.. పెట్టకపోయినా.. వెలగ పండును మాత్రం బొజ్జ గణపయ్యకు ఖచ్చితంగా సమర్పిస్తారు. అందులోనూ ఈ సీజన్ లో లభ్యమయ్యే వెలగ పండులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట. ఈ పండులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని, వెలగ పండును ఖచ్చితంగా తినాలని నిపుణులు కూడా చెబుతున్నారు. వెలగ పండుతో ఎన్నో అనారోగ్య సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చని అంటున్నారు.
ఆయుర్వేదంలో కూడా వెలగ పండును.. పలు రోగాలను నయం చేసుకోవడానికి ఉపయోగిస్తారు. అల్సర్ నుంచి బయట పడొచ్చు:- వెలగ పండును తింటే అల్సర్ నుంచి బయట పడొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ పండును నేరుగా తిన్నా.. లేక జ్యూస్ రూపం తీసుకున్నా మంచిదేనని వెల్లడించారు. రక్తాన్ని శుద్ధి చేస్తుంది.. రక్తాన్ని శుద్ధి చేసే గుణం వెలగ పండులో ఉందట. ఈ సీజన్ లో లభ్యమైనప్పుడు వెలగ పండును తీసుకుంటే రక్తాన్ని శుభ్ర పరుచుకోవచ్చు. బలహీనత తగ్గుతుంది.. వెలగ పండులో రోగ నిరోధక శక్తి ఉంటుంది.
వెలగ పండు జ్యూస్ లో బెల్లాన్ని కలుపుకుని తాగితే బలహీనత, నీరసం వంటివి ఏమైనా ఉంటే ఉపశమనం లభిస్తుంది. మూత్ర పిండాల సమస్యలను తగ్గించుకోవచ్చు.. వెలగ పండుతో మూత్ర పిండాల ప్రాబ్లమ్స్ ను కూడా తగ్గించుకోవచ్చు. ఈ పండు తిన్నా, తాగినా మూత్ర పిండాలు ఆరోగ్యం ఉంచేందుకు హెల్ప్ చేస్తుందట. క్యాన్సర్ రాకుండా నిరోధిస్తుంది.. ముఖ్యంగా ప్రస్తుత కాలంలో చాలా మంది స్త్రీలు రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ బారిన పడుతున్నారు. వెలగ పండు తినడం వల్ల క్యాన్సర్ ముప్పు నుంచి తప్పించుకోవచ్చట.
షుగర్ ను కంట్రోల్ లో పెట్టొచ్చు.. వెలగ పండు రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తుంది. కాబట్టి ఈ పండు తినడం వల్ల షుగర్ ను అదుపులో పెట్టుకోవచ్చు. ఇమ్యూనిటీని పెంచుతుంది..వెలగ పండులో రోగ నిరోధక శక్తిని పెంచే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ పండు తిన్నా, జ్యూస్ రూపంలో తాగినా ఇమ్యూనిటీ లెవల్స్ అనేవి పెరుగుతాయి. వెలగ పండు తింటే 21 బ్యాక్టీరియాలతో పోరాడే శక్తి లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.