News

వామ్మో, రోడ్డు పక్కన స్నాక్స్ తింటున్న అమ్మాయిలు, ఒక్కసారిగా ఏం జరిగిందో చుడండి.

ట్రాఫిక్ ఎక్కువ‌గా ఉంటే న‌ష్టం కూడా ఎక్కువ‌గా ఉంటుంది. రోడ్డు మీదికి ఎక్కువ‌గా కుక్క‌లు, పిల్ల‌లు లాంటి జంతువులు దూసుకొస్తుంటాయి. కానీ.. విచిత్రంగా ఓ ఆవు ట్రాఫిక్ ఉన్న రోడ్డు మీదికి దూసుకొచ్చి ర‌చ్చ ర‌చ్చ చేసింది. ఆ ఆవు చేసిన ర‌చ్చ చూసిన జ‌నాలు బిత్త‌ర‌పోయారు. అయితే ఎంతటి సాధు స్వభావులైనప్పటికీ వారిలోనూ ఒక్కోసారి కోపం కట్టలు తెంచుకుంటుంది. ఇది మనుషుల స్వభావం.. ఇక జంతువుల గురించి వేరే చెప్పనక్కర్లేదు.

అయితే సాధారణంగా ఆవులను సాధు జంతువులుగా మనం చూస్తాం. కానీ ఎంత సాధుజీవులు అయినా ఆవుల్లోనూ జంతు ప్రవృత్తి ఉంటుందనే విషయం మరోసారి నిరూపణ అయింది. ఢిల్లీలోని ఓ వీధిలో పట్టపగలే రెండు ఆవులు కుమ్ముకుంటూ షాప్ బయట కూర్చున్న ముగ్గురు యువతులపైకి హఠాత్తుగా దూసుకెళ్లిన ఘటన చోటుచేసుకుంది. షాప్ ముందున్న సీసీటీవీలో రికార్డయిన ఈ దృశ్యం నెటిజన్లను షాక్‌కు గురిచేసింది.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఆ వీడియోలో ముగ్గురు యువతులు ఓ షాప్ బయట స్నాక్స్‌ తింటున్నారు. వారిలో ఇద్దరు కూర్చోగా మరో యువతి నిలబడింది. ఇంతలో హఠాత్తుగా రెండు ఆవులు కుమ్ముకుంటూ వారిపైకి దూసుకెళ్లాయి. దీంతో వారంతా ఒక్కసారిగా కిందపడిపోయారు. అయినా ఆవులు ఆగకుండా కుమ్ముకుంటూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఒక ఆవు గిట్టలకింద ఓ యువతి చిక్కుకుపోయింది.

అటుగా వెళ్తున్న వ్యక్తులు వెంటనే స్పందించారు. ఒకరు ఆవులను చెదరగొట్టగా మరొకరు కిందపడ్డ యువతిని పైకిలేపి పక్కకు తీసుకెళ్లారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు సకాలంలో స్పందించిన యువకులను ప్రశంసించారు. అలాగే రోడ్లపై ఆవులు తిరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker