News

చిన్నప్పుడు స్కూల్లో టాప్ ర్యాంకర్, ఇప్పుడు ఇండస్ట్రీ టాప్ హీరోయిన్, ఎవరో గుర్తుపట్టగలరా..?

అందమైన క్షణాలను మిస్ అవుతున్నాను అంటూ స్కూల్ డేస్ ఫోటో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరలవుతుండగా.. పాఠశాలలో రోజుల్లో సంయుక్త టాపర్ అని తెలిసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. మలయాళంలో అనేక చిత్రాల్లో నటించిన సంయుక్త..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ మూవీతో సెకండ్ హీరోయిన్‏గా తెలుగు తెరకు పరిచయమైంది. ఇందులో సంయుక్త కనిపించింది తక్కువ సమయమే అయినా ఫుల్ క్రేజ్ సొంతం చేసుకుంది. అందం, అమాయకత్వంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది.

దీంతో ఈ బ్యూటీకి యూత్ లో మంచి క్రేజ్ వచ్చేసింది. ఆ తర్వాత సాయి ధరమ్ తేజ్ సరసన విరూపాక్ష, ధనుష్ జోడిగా సార్ చిత్రాలతో మరిన్ని హిట్స్ అందుకుంది. అయితే ప్రస్తుతం ఇండస్ట్రీలో రాణిస్తున్న హీరోయిన్స్ అందరూ మల్టీటాలెంటెడ్. ఇప్పుడు అద్భుతమైన నటనతో మెప్పిస్తున్న తారలలో మరో టాలెంట్ దాగి ఉంది. శ్రీలీల, సాయి పల్లవి ఓవైపు డాక్టర్ చదువు కొనసాగిస్తూనే మరోవైపు నటీమణులుగా వెండితెరపై సందడి చేస్తున్నారు. అలాగే మరికొందరు హీరోయిన్స్ కొన్ని క్రీడలలో నేషనల్ ఛాంపియన్స్.

కానీ పైన ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి మాత్రం ఇండస్ట్రీలో చాలా స్పెషల్. స్కూల్లో వన్ ఆఫ్ ది టాపర్. అప్పట్లో చదువుల్లో మంచి మార్కులు సంపాదించింది. ఇక ఇప్పుడు ఇండస్ట్రీలోనూ అందం, అభినయం పరంగా మంచి మార్కులే కొట్టేసింది. ముఖ్యంగా ఆ అమ్మాయికి యూత్‏లో మంచి క్రేజ్ ఉంది. బ్యాక్ టూ బ్యాక్ హిట్ చిత్రాలతో విజయాన్ని అందుకుంది. దీంతో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ కావడం ఖాయమనుకున్నారు. కానీ టాలెంట్ ఎంత ఉన్నా ఈ బ్యూటీకి మాత్రం అవకాశాలు రావడం లేదు.

పైన ఫోటోను చూశారు కదా.. ఆ పేపర్ లో కనిపిస్తున్న అమ్మాయి ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టగలరా ..? తెలుగులో నటించింది అతి తక్కువ సినిమాలే అయినా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటివరకు ఈ అమ్మడు నటించిన చిత్రాలన్ని బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. కానీ ఈ బ్యూటీని మాత్రం మేకర్స్ అంతగా పట్టించుకోవడం లేదు. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరా అనుకుంటున్నారా ..? తనే హీరోయిన్ సంయుక్త మీనన్.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker