Goat Milk: ఆవు, గేదె పాలు కాకుండా.. ఈ పాలు తాగితే చాలు, ఆ రోగాలన్నీ మటుమాయం.

Goat Milk: ఆవు, గేదె పాలు కాకుండా.. ఈ పాలు తాగితే చాలు, ఆ రోగాలన్నీ మటుమాయం.
Goat Milk: మేకపాలలో ఎక్కువగా ఐరన్ ఉంటుంది. ఓ పరిశోధనలో ఆవు పాలు తాగిన ఎలుకల కంటే మేకపాలు తాగిన ఎముకల్లో ఎక్కువ హిమోగ్లోబిన్ పునరుత్పత్తి సామర్థ్యం ఉన్నాయి. ఇందులోని గుణాలు బ్రెయిన్ డెవలప్‌మెంట్‌కి చాలా మంచిది. అయితే మేక పాలలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి.

ఇందులో కాల్షియం, విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. అందువల్ల ఈ పాలను క్రమం తప్పకుండా తాగడం వల్ల అనేక వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చని నిపుణులు అంటున్నారు. మేక పాలు సులభంగా జీర్ణమవుతాయి. అంతే కాదు ఈ పాలు తక్కువ అలెర్జీని కలిగిస్తాయి.
మేక పాలు ఆరోగ్య ప్రయోజనాలు..
గుండె ఆరోగ్యానికి మేలు.. గుండెపోటు, స్ట్రోక్, ఇతర వాస్కులర్ వ్యాధులను నివారిస్తుంది. మేక పాలలో ఉండే పొటాషియం రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. జీర్ణం కావడం సులభం..మేక పాలు సులభంగా జీర్ణమవుతాయి. జీర్ణక్రియకు సహాయపడతాయి. ఎలాంటి అసౌకర్యాన్ని అయినా తగ్గిస్తాయి.
Also Read: వాల్‌నట్స్ రోజు రెండు తింటే చాలు.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది..మేక పాలలో సెలీనియం, జింక్, విటమిన్లు ఎ, సి ఉంటాయి. ఇవి శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడమే కాకుండా ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించడంలో కూడా సహాయపడతాయి. చర్మ ఆరోగ్యానికి మంచిది..మేక పాలలో ఆల్ఫా హైడ్రాక్సీ ఆమ్లాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని కాంతివంతం చేయడానికి, రక్షణకు ఉపయోగపడతాయి.
Also Read: ఈ మాత్రలు వాడుతున్నారా..?
అంతే కాదు చర్మాన్ని మృదువుగా చేయడంలో కూడా సహాయపడుతుంది. మెదడుకు పోషణ అందిస్తుంది..మేక పాలలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి మెదడు అభివృద్ధికి, జ్ఞాపకశక్తికి చాలా మంచివి. ఎముకల ఆరోగ్యానికి మేలు..కాల్షియం, విటమిన్ డి అధికంగా ఉండే మేక పాలు ఎముకల బలాన్ని పెంచుతాయి. ఆస్టియోపోరోసిస్ వంటి శరీర సమస్యలను నివారిస్తాయి.
శోథ నిరోధక లక్షణాలు..
మేక పాలలో శరీరంలో మంటను తగ్గించే లక్షణాలు ఉన్నాయి. ఇది పిత్త సమస్యలను తొలగిస్తుంది. మేక పాలలో కాల్షియం, విటమిన్లు ఎ, బి6 పుష్కలంగా ఉంటాయి. ఈ పాలు తాగడం వల్ల గుండె, ఎముకల ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంతే కాదు ఇది వాపును తగ్గిస్తుంది. ఆందోళనను తగ్గిస్తుంది. రక్తహీనత సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది.