Gold Price: ప్రజలకు గుడ్ న్యూస్, భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు. తులం ధర ఎంతో తెలుసా..?

Gold Price: ప్రజలకు గుడ్ న్యూస్, భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు. తులం ధర ఎంతో తెలుసా..?
Gold Price: పన్ను, ఎక్సైజ్ సుంకం కారణంగా బంగారం, వెండి ధరలు ప్రతిరోజూ హెచ్చుతగ్గులకు లోనవుతూనే ఉన్నాయి. బంగారం ధరలు ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతుంది. మన భారతీయ సాంప్రదాయంలో బంగారానికి మహిళలు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. అయితే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పలు దేశాలతో జరుగుతున్న వాణిజ్య చర్చల్లో భాగంగా ట్యారిఫ్ ప్లాన్ విషయంలో పునరాలోచన చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో మార్కెట్లో ఈ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్నాయని చెప్పవచ్చు. అయితే ఇన్వెస్టర్లు మాత్రం బంగారం పై పెట్టుబడులను తగ్గించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా బంగారం డిమాండ్ తగ్గి ధర అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. దీనికి తోడు వెండి ధర కూడా ఆల్ టైం రికార్డు తో సమానంగా దూసుకెళ్తోంది అని చెప్పవచ్చు. సిల్వర్ సైతం రికార్డు స్థాయిలో పెరగడానికి ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లో పరిణామాలే కారణం అని చెప్పవచ్చు.
Also Read: కాశీలో శివుని భక్తిలో లీనమైపోయిన టాలీవుడ్ హీరోయిన్..!
ముఖ్యంగా వెండి ధరలు పెరగడానికి ప్రధానంగా వెండిని పారిశ్రామికంగా ఎక్కువగా ఉపయోగిస్తారు అన్న సంగతి గుర్తుంచుకోవాలి. . ఎందుకంటే వెండిని అటు పాటిస్రామికంగా కూడా ఎక్కువగా ఉపయోగిస్తుంటారు ముఖ్యంగా సెమీ కండక్టర్ల తయారీలోనూ ఎలక్ట్రానిక్ వెహికల్స్ తయారీలోనూ ఇతర ఎలక్ట్రికల్ వస్తువుల తయారీలో కూడా వెండిని ఉపయోగిస్తుంటారు. ఫలితంగా వెండి ధర కూడా రికార్డు స్థాయిలో దూసుకెళ్తోంది అని చెప్పవచ్చు.
Also Read: డైరెక్టర్ అనుదీప్ కు ఘోర అవమానం..!
మన వైపు ఆషాడమాసం కొనసాగుతున్న నేపథ్యంలో పసిడి ఆభరణాలు కొనుగోలు చేసే వారికి తగ్గుతున్న బంగారం ధరలు ఉపశమనం కల్పించే అవకాశం ఉంటుంది. అయితే మరికొన్ని రోజుల్లో శ్రావణమాసం ప్రారంభంతో వివాహ సీజన్ ప్రారంభం కానుంది. అందుకే బంగారం ధర తగ్గినప్పుడల్లా కొద్ది మొత్తంలో కొనుగోలు చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో పెరుగుతున్న ధరల నుంచి మీరు బయటపడే అవకాశం ఉంటుంది.