గూగుల్ పే వాడుతున్నవారికి అద్దిరిపోయే గుడ్ న్యూస్. ఎలానో తెలుసుకోండి.
కేటుగాళ్లు ఎప్పటికప్పుడు కొత్తకొత్త మార్గాల్లో అమాయక జనాలను బురిడీ కొట్టిస్తున్నారు. అప్రమత్తంగా లేకుంటే బ్యాంకు ఖాతాలను ఊడ్చేస్తున్నారు. అందుకే ఇలాంటి మోసాల విషయంలో వినియోగదారుల మరింత అప్రమత్తం చేయడం లక్ష్యంగా ‘ఫ్రాడ్ డిటెక్షన్’ను డిజిటల్ పేమెంట్ యాప్ ‘గూగుల్ పే’ ప్రవేశపెట్టింది. అయితే రాను రాను ఆన్ లైన్ ట్రాంజాక్షన్స్ చేసే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. ప్రతి చిన్న అవసరానికి UPI సేవలు వినియోగించుకుంటున్నారు. గూగుల్ పే, ఫోన్ పే, Pay TM లాంటి యాప్స్ తో లావాదేవీలు జరుపుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా గూగుల్ పే తన వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. తమ సేవలను మరింత విస్తరిస్తున్నట్లు తెలిపింది. ఈ ఫీచర్ ద్వారా విదేశాల్లో ఉండేవారికి, అదేవిధంగా విదేశీ ట్రాంజాక్షన్స్ చేసే వారికి హెల్ప్ కానుంది. ఇప్పుడు UPI పేమెంట్స్ లో సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఇకపై రూపాయల్లోనే కాకుండా డాలర్ల రూపంలో కూడా చెల్లింపులు చేసేలా మరో ఫెసిలిటీ కల్పించబోతున్నారు.
డాలర్ మాత్రమే కాదు వివిధ దేశాల కరెన్సీని పంపించేలా చర్యలు తీసుకొస్తున్నారు. ఇందు కోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI), ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ (ఎన్‌ఐపీఎల్)తో.. గూగుల్ పే అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. సో.. ఇకపై విదేశాలకు వెళ్లినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పేమెంట్స్ చేసేందుకు వీలు కలుగుతుంది. ఈ ఫీచర్ వల్ల విదేశాలకు వెళ్లే భారతీయులు నగదును వెంట తీసుకెళ్లే అవసరం తగ్గుతుందని గూగుల్ పే అంటోంది.
విదేశాలకు వెళ్లిన ప్రవాస భారతీయులు మన దేశానికి (తమ కుటుంబీకులు, స్నేహితులకు) నగదు పంపే సమయంలో ఇంటర్నేషనల్ గేట్ వే ఛార్జీల భారం తగ్గుతుందని చెబుతోంది. ఇది అందరికీ ఉపయోగకరమైన ఫీచర్ అని చెప్పుకోవచ్చు. కాగా.. UPI ట్రాన్సాక్షన్స్‌కు కూడా ఆన్‌లైన్ స్కామ్‌లు, మోసాల ముప్పు ఎల్లప్పుడూ పొంచి ఉంటుంది. అందుకే డబ్బు, ఐడెంటిటీని రక్షించుకోవడానికి, స్ట్రాంగ్ UPI పర్సనల్ ఐడెంటిఫికేషన్ నంబర్ (UPI PIN)ని క్రియేట్ చేసుకోవాలి.
అలానే దానిని క్రమం తప్పకుండా మార్చాలి. UPI పిన్ అనేది UPI ట్రాన్సాక్షన్‌ను యాక్సెప్ట్ లేదా ఆథరైజ్ చేయడానికి ఎంటర్ చేసే నాలుగు లేదా ఆరు అంకెల కోడ్. UPI పిన్‌ని ఎవరితోనూ షేర్ చేయకూడదు. షేర్ చేస్తే మోసగాళ్లు డబ్బును ఈజీగా కొట్టేస్తారు.