News

ఆలస్యంగా వచ్చిన హీరోయిన్, రెచ్చిపోయి రాళ్లతో దాడి చేసిన అభిమానులు, వైరల్ వీడియో.

ఒక్కసారి పాపులారిటీ సొంతం చేసుకున్న తర్వాత స్వేచ్ఛగా బయట తిరగలేరు.. ఎక్కడికెళ్లినా జనాలు ఎగబడతారు. ఫోటోలు, సెల్ఫీలు అంటూ నానా రచ్చ చేస్తారు. ఇప్పుడు అదే పరిస్థితి ఓ హీరోయిన్ కు ఎదురైంది. దాంతో అమ్మడు బిత్తరపోయింది. భోజ్‌పురి ప్రముఖ నటి, గాయని అక్షర సింగ్‌ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ ముద్దుగుమ్మ లైఫ్ షోలను కూడా ఇస్తూ ఉంటుంది. అక్షర సింగ్‌ భారీగా ఫ్యాన్స్ తరలి వస్తారు.

ఈసారి కూడా అలానే వచ్చారు. కానీ సీన్ రివర్స్ అయ్యింది. బీహార్ లోని ఔరంగాబాద్ లో ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి అక్షర సింగ్ హాజరైంది. అయితే అనుకున్న సమయానికంటే చాలా ఆలస్యంగా ఆమె హాజరైంది. అయితే అప్పటికి భారీ ఎత్తున మాల్ వద్దకు అభిమానులు చేరుకున్నారు.

అక్షర సింగ్ చాలా ఆలస్యంగా హాజరు కావడంతో అభిమానులు అసహనానికి గురయ్యారు. అక్షర సింగ్ వచ్చిన తర్వాత అభిమానుల గందరగోళం మరింత ఎక్కువైంది. తోపులాట జరిగింది. దీనితో పోలీసులు అభిమానులని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. చాలా సమయం నుంచి ఎదురు చూస్తున్నప్పటికీ హీరోయిన్ దగ్గరకు వెళ్లనివ్వకపోవడంతో ఫ్యాన్స్ లో ఆగ్రహం ఎక్కువైంది. ఈ క్రమంలో కొందరు రాళ్ల దాడికి తెగబడ్డారు.

పోలీసులు కూడా లాఠీ ఛార్జ్ చేశారు. ఈ క్రమంలో అభిమానులతో పాటు పోలీసులు కూడా గాయపడ్డట్లు తెలుస్తోంది. అభిమానుల ఆందోళన ఎక్కువ కావడంతో పోలీసులు అక్షర సింగ్ కి రక్షణ కవచంలాగా నిలబడి అక్కడి నుంచి పంపించేశారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker