News

అయోధ్యలో భోజనం ఖర్చు ప్రభాస్‌దే..? భోజనానికి ఎన్ని కోట్లు ఖర్చు చేస్తున్నారో తెలుసా..?

అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవాన్ని చూసేందుకు దేశ విదేశాల నుంచి వేల సంఖ్యలో సెలబ్రిటీలు హాజరవుతుండగా.. లక్షల్లో సామాన్య ప్రజలు హాజరుకాబోతున్నారు. నలుమూల నుంచి, ఇతర దేశాల నుంచి కోట్లాది మంది రామ భక్తులు అయోధ్యకు రానున్నారు. ఇప్పటికే అయోధ్యలో భక్తులు కిక్కిరిసిపోతున్నారు. అయితే అయోధ్యకు వచ్చే భక్తుల కోసం భోజనం ఖర్చు ప్రభాస్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. అయోధ్యలోని దాదాపు 300 ప్రదేశాల్లో భోజనం ఏర్పాట్లు చేస్తున్నారు.

అయితే ఆ రోజు అయోధ్యకు వచ్చే లక్షలాది మంది భక్తుల కోసం 300 ప్రదేశాలలో అన్నదానం చేయాలని ట్రస్టు నిర్ణయించింది. కాగా.. ఆ అన్నదానానికి అయ్యే ఖర్చు మొత్తం తానే భరిస్తానంటూ టాలీవుడ్ యాక్టర్, బాహుబలి ప్రభాస్ ముందుకొచ్చాడు. అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవాన్ని చూసేందుకు దేశం నలు మూలల నుంచి, ఇతర దేశాల నుంచి కూడా రామ భక్తులు అయోధ్యకు వస్తున్నారు. వాళ్ళందరికీ అయ్యే భోజనాల ఖర్చును భరించడానికి ప్రభాస్ నిర్ణయం తీసుకున్నాడు.

అయితే ఆ ఒక్క రోజు అన్నదానం కోసం దాదాపు రూ. 50 కోట్లు ఖర్చవుతుందని ఓ అంచనా. ప్రభాస్ తాను నటించే సినిమాల షూటింగ్ సమయంలో కూడా సెట్‎లో ఉన్నవారందరికీ భోజనాలు సమకూర్చుతుంటాడు. షూటింగ్ లోకేషన్‎లో ఉన్న వారందరికీ ఈ రెబల్ స్టార్ ఫుడ్ తెప్పిస్తుంటాడు. ప్రభాస్ భోజనంలో ఎన్ని రకాల ఫుడ్ ఐటెమ్స్ ఉంటాయో.. మిగతా సిబ్బంది ప్లేట్స్‎లోనూ అవన్నీ ఉండాల్సిందే. రెబల్ స్టార్ కృష్ణం రాజు చనిపోయిన తర్వాత.. పెద కర్మ రోజు కూడా దాదాపు 70 వేల మందికి మంచి రుచికరమైన భోజనాలు పెట్టించి వార్తల్లో నిలిచాడు.

ఇప్పుడు అయోధ్యలోనూ 50 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి అన్నదానం చేయాలని నిర్ణయం తీసుకొని మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. అయితే ట్రస్ట్ నిర్వాహకులు మాత్రం ఇంకా ఫైనల్ చేయలేదు. ఇప్పటికే మరికొంత మంది దాతలు ముందుకొచ్చారని, కమిటీ ఓ సారి భేటీ అయిన నిర్ణయం ప్రకటిస్తామని తెలిపారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker