Health

బీపీ, షుగర్ సమస్యలున్నవారు ఖచ్చితంగా ఈ గ్రీన్ కాఫీ తాగాలి, ఒక్కసారి తాగితే..?

అనేక ఆరోగ్య ప్రయోజనాలకు ప్రసిద్ధి చెందిన వాటిలో ఒకటి గ్రీన్ కాఫీ. జీవక్రియను పెంచడం, ఒత్తిడిని తగ్గించడం.. బరువు తగ్గించడం వంటి ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఇది అందిస్తుంది. గ్రీన్ కాఫీ మీరు శక్తివంతంగా ఉండటానికి సహాయపడుతుంది. సాధారణ కాఫీలా కాకుండా, గ్రీన్ కాఫీ గింజలు కాల్చరు. పూర్తిగా పచ్చిగా ఉంటాయి. అందువలన గ్రీన్ కాఫీలో క్లోరోజెనిక్ యాసిడ్ అనే రసాయనం ఎక్కువ పరిమాణంలో ఉంటుంది. అయితే సాధారణంగా కాఫీ గింజలు నల్లగా ఉంటాయి. అయితే చెట్టు నుంచి కోసేప్పుడు అవి పచ్చగానే ఉంటాయి. వాటిని ఎండబెట్టి రోస్ట్‌ చేసేసరికల్లా దానిలో పరిమళం ఇంకా పెరిగి నల్లగా తయారవుతాయి.

అందువల్లనే కాఫీకి ఆ రుచి, రంగు వస్తాయి. అయితే వీటిని రోజ్ట్‌ చేయకుండా అలానే ఉంచి కాఫీ తయారు చేసుకుంటే దాన్నే గ్రీన్‌ కాఫీ అంటారు. దీనిలో కెఫీన్‌ తక్కువగా ఉంటుంది. అందుకనే మధుమేహం, బీపీ, ఊబకాయం, ఎక్కువ కొలస్ట్రాల్‌తో బాధ పడుతున్న వారంతా దీన్ని ఎలాంటి అనుమానమూ లేకుండా తాగేయొచ్చు. బరువు తగ్గడంలో:- ఒక కప్పు మామూలు కాఫీని తాగడంతో పోలిస్తే గ్రీన్‌ కాఫీని తాగడం వల్ల 25 నుంచి 50 శాతం వరకు కెఫీన్‌ తక్కువగా మన శరీరానికి అందుతుంది.

అందువల్ల కెఫీన్‌తో వచ్చే దుష్ప్రభావాలు చాలా వరకు తగ్గిపోతాయి. బరువు తగ్గాలని అనుకునే వారు ఉదయాన్నే దీన్ని తాగడం వల్ల ప్రయోజనం ఉంటుంది. 12 వారాల పాటు రోజూ క్రమం తప్పకుండా తాగుతూ ఉండటం వల్ల బరువు తగ్గినట్లు కొన్ని పరిశీలనల్లో వెల్లడయ్యింది. మధుమేహ వ్యాధిగ్రస్తులు దీన్ని ఎలాంటి అనుమానమూ లేకుండా తాగవచ్చు. దీనిలో ఉండే క్లోరోజెనిక్‌ యాసిడ్‌ అనేది పిండి పదార్థాల్ని శరీరం ఎక్కువగా శోషించుకోనీయకుండా అడ్డు పడుతుంది.

అందువల్ల షుగర్‌ ఒక్కసారిగా పెరగడం, మధుమేహం రావడం లాంటివి చాలా వరకు తగ్గుతాయి. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీంతో ఫ్రీ రాడికల్స్‌ వల్ల చర్మ కణాలు నష్ట పోకుండా ఉండేలా చేస్తుంది. అందువల్ల చర్మం ముడతలు రావడం, గీతలు పడటం లాంటి వయసు సంబంధిత సమస్యలన్నీ దరి చేరకుండా ఉంటాయి. గ్రీన్‌ కాఫీని మంచి సహజమైన డిటాక్సిఫయర్‌గా చెబుతారు. దీన్ని క్రమం తప్పకుండా రోజూ ఒక కప్పు చొప్పున తీసుకుంటూ ఉండటం వల్ల విష పదార్థాలు, వ్యర్థాలు శరీరం నుంచి బయటకు వెళ్లిపోతాయి.

అలాగే అధికంగా ఉండే కొవ్వుల్ని కూడా ఇది కరిగిస్తుంది. ఫలితంగా అధిక కొలెస్ట్రాల్‌ సమస్యలు తగ్గుముఖం పడతాయి. అలాగే ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. స్ట్రెస్‌ హార్మోన్‌ స్థాయిలు తగ్గడం వల్ల రక్త నాళాలపై ఒత్తిడి తగ్గుతుంది. దీంతో రక్తపోటూ అదుపులో ఉంటుంది. అయితే అతి అనర్థం అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. మంచిది కదా అని ఎక్కువ కప్పుల గ్రీన్‌ టీని తాగడం వల్ల చెడు ఫలితాలు కూడా ఉంటాయి. రోజుకు ఒకటి నుంచి రెండు కప్పుల వరకు దీన్ని తాగవచ్చు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker