News

స్కూల్ డ్రస్‌లో ఇనోసెంట్‌గా కనిపిస్తున్న ఈ పిల్లల్లో ఇద్దరు స్టార్ హీరోలు ఉన్నారు, ఎవరో గుర్తు పట్టండి, చూద్దాం..?

ఒకే స్కూల్ లో చదువుకొని ఇప్పుడు హీరోలుగా రాణిస్తున్నారు. ఇప్పటికి తమ స్నేహాన్ని కంటిన్యూ చేస్తున్నారు. వీరి స్నేహాన్ని చూసి అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉంటారు. తాజాగా అలాంటి ఇద్దరు స్నేహితుల పాత ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పైన కనిపిస్తోన్న ఫొటోలో ఇద్దరు స్టార్ హీరోలు ఉన్నారు. ఎవరో గుర్తుపట్టారా..? అయితే ఇంతకీ ఆ ఇద్దరు హీరోలు ఎవరో చూద్దాం. క్లాస్ మేట్స్ అయిన ఆ ఇద్దరు కుర్రాళ్లలో ఒకరు హృతిక్ రోషన్ కాగా మరొకరు జాన్ అబ్రహం.

హృతిక్ రోషన్ తెలుగు యూనిఫామ్ లో ఉన్నాడు. కింద వరుసలో జాన్ అబ్రహం బూడిదరంగు యూనిఫామ్ లో ఉన్నాడు. హృతిక్-జాన్ అబ్రహం క్లాస్ మేట్స్ అని అందరికీ తెలిసిందే. బాలీవుడ్ దర్శక నిర్మాత రాకేష్ రోషన్ కుమారుడే హృతిక్ రోషన్. బాల్యంలోనే కొన్ని చిత్రాల్లో నటించాడు. 2000లో విడుదలైన కహోనా ఫ్యార్ హై చిత్రంతో హీరోగా సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యాడు. అమీషా పటేల్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి రాకేష్ రోషన్ దర్శకుడు కావడం విశేషం. కహోనా ఫ్యార్ హాయ్ భారీ విజయం సాధించింది.

క్రిష్, ధూమ్ 2 చిత్రాలతో ఆయన స్టార్ హీరో ఇమేజ్ తెచ్చుకున్నాడు. ఇండియాలోనే అత్యంత హ్యాండ్సమ్ హీరోగా హృతిక్ రోషన్ పేరుగాంచాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ తో కలిసి మల్టీస్టారర్ చేస్తున్నాడు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న వార్ 2 చిత్రీకరణ జరుపుకుంటుంది. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం పై విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఎన్టీఆర్ ఈ చిత్రంలో రా ఏజెంట్ రోల్ చేస్తున్నారు. వార్ 2 కోసం ఎన్టీఆర్ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ఇక జాన్ అబ్రహం జిస్మ్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యాడు. 2003లో ఈ చిత్రం విడుదలైంది. ధూమ్ మూవీలో జాన్ అబ్రహం స్మార్ట్ దొంగ పాత్రలో అలరించాడు. ఈ సిక్స్ ప్యాక్ హీరో బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరిగా పేరు తెచ్చుకున్నాడు. ఈ మధ్య జాన్ అబ్రహం హవా తగ్గింది. గత ఏడాది విడుదలైన షారుఖ్ ఖాన్ బ్లాక్ బస్టర్ మూవీ పఠాన్ లో విలన్ రోల్ చేయడం విశేషం. చేతినిండా చిత్రాలతో ప్రస్తుతం బిజీగా ఉన్నాడు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker