News

బాపు బొమ్మలా అందంగా కనిపిస్తున్న ఈమె. ఓ స్టార్ హీరో భార్య అని మీకు తెలుసా..?

సూపర్ స్టార్ కృష్ణ తనయుడు మహేష్ బాబు హీరోగా నెంబర్ వన్ రేస్ లో ఉన్నాడు. కృష్ణ చిన్న అల్లుడు సుధీర్ బాబు సైతం హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కృష్ణ చిన్న కూతురు, మహేష్ బాబు చెల్లెలు ప్రియదర్శినిని హీరో సుధీర్ బాబు 2006 లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. సుధీర బాబు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటారు. అయితే ఈ ఫొటోలో ఉన్న కుందనపు బొమ్మను గుర్తు పట్టారా?ఈమె టాలీవుడ్ కు చెందిన ఓ ఫేమస్ సెలబ్రిటీ. అయితే హీరోయిన్ మాత్రం కాదు.

నిర్మాత, దర్శకురాలు కూడా కాదు. సినిమా ఇండస్ట్రీలో ఉన్న 24 ఫ్రేమ్స్ తో ఆమెకు ఎలాంటి సంబంధం లేదు. అయితే ఈ కుందనపు బొమ్మ ఓ టాలీవుడ్ దిగ్గజ నటుడి కుమార్తె. స్టార్ హీరో సోదరి.. అలాగే ఓ వర్సటైల్ యాక్టర్ సతీమణి. టాలీవుడ్ లో వీరి ఫ్యామిలీకి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. ముఖ్యంగా ఆమె సోదరుడు టాలీవుడ్ లో టాప్ హీరోగా వెలుగొందుతున్నాడు. అతనంత కాకపోయినా భర్త కూడా మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. వైవిధ్యమైన కథలతో సినిమాలు చేస్తూ వెర్సటైల్ యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.

మరి ఇప్పుడైనా ఆమె ఎవరో గుర్తు పట్టారా? కొంచెం కష్టంగా ఉందా? అయితే సమాధానం మేం చెబుతాం లెండి. ఆమె ఎవరో కాదు.. సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరి, దివంగత సూపర్ స్టార్ కృష్ణ చిన్న కూతురు ప్రియదర్శిని ఘట్టమనేని. టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు సతీమణి. సుధీర్, ప్రియదర్శినిల పెళ్లి మే 29, 2006లో గ్రాండ్ గా జరిగింది. వీరిద్దరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. బుధవారం (మే 29) సుధీర్ బాబు, ప్రియ దర్శినిల వివాహ వార్షికోత్సవం.

ఈ సందర్భంగా తన సతీమణికి వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపాడీ ట్యాలెంటెడ్ హీరో. తన భార్య ప్రియదర్శిని పెళ్లిచూపుల ఫోటోను సోషల్ మీడియాలో పంచుకుని మ్యారేజ్ యానివర్సరీ విషెస్ తెలిపాడు. ‘ నాతో ఉన్నప్పటి తన మొదటి ఫోటో.. అంతేకాదు పెళ్లిచూపుల ఫొటో’ అని దీనికి క్యాప్షన్ ఇచ్చాడు సుధీర్. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన అభిమానులు, నెటిజన్లు సుధీర్ బాబు, ప్రియదర్శిని దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker