హార్దిక్‌తో విడాకుల విషయంలో అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చిన నటాషా..! వెలుగులోకి అసలు విషయం.
హార్దిక్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో తన సారథ్యంలో ముంబై ఇండియన్స్ జట్టును ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. అయితే ఆటపరంగా అతడు శ్రద్ధ కనబర్చకపోవడానికి కారణం వ్యక్తిగత జీవితంలో భారీ ఎదురుదెబ్బ తగులుతోందని సమాచారం. తాను ప్రేమించి డేటింగ్ చేసి.. పెళ్లి చేసుకున్న భార్య నటాషా స్టాంకోవిక్ విడాకులు తీసుకోబోతున్నదని సమాచారం. అయితే ఇప్పటివరకు జరిగిన గత రెండు ఐపీఎల్‌లలో, నటాషా స్టాంకోవిచ్ స్టేడియానికి వచ్చిన హార్దిక్‌ను ఉత్సాహపరిచింది. కానీ ఈ ఏడాది ఐపీఎల్‌లో మాత్రం నటాషా ఏ స్టేడియంలోనూ కనిపించలేదు.
సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే ఆమె హార్దిక్ పాండ్యాతో కలిసి దిగిన ఒక్క ఫొటోను కూడా పోస్ట్ చేయలేదు. అలా ఇద్దరి మధ్య బ్రేకప్ చర్చ మొదలైంది. కొందరు ఇంకా ముందుగు అడుగేసి విడాకుల విషయంలో నటాషాకు ఎంత ఆస్తి వస్తుందనే దానిపై మీడియాలో వాడివేడిగా చర్చ కూడా జరిపారు. బయట ఇంత జరుగుతున్నా హార్దిక్, నటాషా ఇద్దరూ సైలెంట్‌గా ఉండడం విడాకుల రూమర్లకు మరింత బలం చేకూర్చినట్లయింది. అయితే ఇప్పుడు నటాషా స్టాంకోవిచ్ ఒక అడుగు ముందుకు వేసింది.
తద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. అదేంటంటే.. నటాషా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో హార్దిక్ పాండ్యాతో ఉన్న అన్ని ఫోటోలను రీస్టోర్ చేసింది. ఇందులో వాలెంటైన్స్ డే ఫోటోలు కూడా ఉన్నాయి. హార్దిక్‌తో నటాషా ఫోటోలు మళ్లీ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రత్యక్షమయ్యాయి. దీంతో ఇప్పుడీ విడాకుల పుకార్లకు చెక్ పడినట్టేనని అభిమానులు భావిస్తున్నారు. నటాషా తీసుకున్న ఈ నిర్ణయంతో హార్దిక్ ఫ్యాన్స్ కూడా హ్యాఫీగా ఫీలవుతున్నారు.
అయితే ఆమె తన సోషల్ మీడియా బయో నుండి పాండ్యా ఇంటిపేరును ఎందుకు తొలగించింది? ఫోటోలు ఎందుకు తీసేసింది? మరి ఎందుకు మళ్లీ పునరుద్ధరించింది? అన్నదానికి మాత్రం కారణాలు తెలియరావడం లేదు. నటాషా తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ నుండి పాండ్యా ఇంటిపేరు, హార్దిక్‌తో ఉన్న ఫోటోలను తొలగించింది. దీంతో విడాకుల చర్చలు ఊపందుకున్నాయి. ఇంతలో నటాషా తన స్నేహితుడితో కలిసి ఉన్న ఫోటో ఒకటి వెలుగులోకి వచ్చింది. దీనిని చూసిన వారందరూ నటాషా జీవితంలోకి మరో వ్యక్తి వస్తున్నాడని రూమర్లు వ్యాపింప జేశారు.