News

తెలుగు స్టార్ హీరో కూతురితో తమిళ హీరో శింబు పెళ్లి ఫిక్స్, పెళ్లి ఎప్పుడంటే..?

ప్రస్తుతం శింబు ‘ థగ్ లైఫ్’ మూవీలో నటిస్తున్నారు. అలాగే తన 48వ సినిమా చేయబోతున్నారు. దేశింగు పెరియ స్వామి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని కమల్ హాసన్ నిర్మిస్తున్నారు. ఇది ఇలా ఉంటే… శింబు వయసు 41 ఏళ్లు దాటిపోయింది. ఆయనకు ఇంకా పెళ్లి కాలేదు. ఆ ఊసు కూడా ఎత్తడం లేదు. తాజా సమాచారం ప్రకారం శింబు పెళ్లి ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. అయితే శింబు అసలు పేరు శిలాంబరాసన్. అందరూ శింబు అని పిలుస్తారు. ఈ హీరో చిన్నప్పుడే మేకప్ వేసుకున్నాడు.

చైల్డ్ ఆర్టిస్ట్‌గా సిల్వర్ స్క్రీన్‌పై మెరిశాడు. శింబు 2002లో హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యాడు. తొలి సినిమా ‘కడ్తల్ అజివతిల్లై’. ఈ సినిమా క్రిటిక్స్ నుంచి ప్రశంసలు పొందింది. తర్వాత ఈ హీరో కెరీర్‌లో ఎన్నో హిట్లు అందుకున్నాడు. కొన్ని సినిమాలు మిక్స్‌డ్ టాక్ తెచ్చుకోగా, మరి కొన్ని సినిమాలతో కాంట్రవర్సీలను ఎదుర్కొన్నాడు. అయినా స్టార్‌డమ్ పోగొట్టుకోలేదు. శింబు సినిమా రిలీజ్ అవుతుందంటే గ్యారంటీ ఓపెనింగ్స్ పక్కా. ఇరవై ఏళ్లుగా ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్న ఈ హీరో, రీసెంట్‌గా మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాడు. మానాడు, పట్టు తాలా, వెందు తానిందతు కాదు వంటి సినిమాలు పాజిటివ్ టాక్ సంపాదించాయి.

శింబు ప్రొఫెషనల్ లైఫ్‌లో ఫెయిల్యూర్స్ ఎదుర్కొంటున్న టైమ్‌లోనే పర్సనల్ లైఫ్‌తో ఇబ్బంది పడ్డాడు. ఎంతోమంది హీరోయిన్లతో రిలేషన్‌షిప్ పెట్టుకున్నాడు. అప్పట్లో హీరోయిన్ నయనతారతో డేటింగ్ చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఆ మధ్య హీరోయిన్ హన్సిక మోత్వానితోనూ లవ్ అఫైర్ నడిపాడు. గతంలో ఓ శ్రీలంకన్ బ్యూటీని శింబు మ్యారేజ్ చేసుకోబోతున్నాడని కొన్ని రోజులు ఇంటర్నెట్‌లో చర్చ నడిచింది. ఆ తర్వాత టాలీవుడ్ బ్యూటీ నిధి అగర్వాల్‌తో రిలేషన్‌లో ఉన్నట్లు రూమర్స్ వినిపించాయి. ఇవేవీ పెళ్లి దాకా వెళ్లలేదు. తాజాగా శింబు పెళ్లి టాపిక్ మరోసారి తెరమీదికొచ్చింది. ఇక, పెళ్లి చేసుకుని పర్సనల్ లైఫ్‌లో సెటిల్ అవుదామని అతడు ఫిక్స్ అయ్యాడట.

ఈ హీరో పేరెంట్స్ కూడా సంబంధాలు చూడటం మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే తెలుగు ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటుడి కూతురితో మ్యారేజ్ ఫిక్స్ అయినట్లు వార్తలొస్తున్నాయి. శింబు మ్యారేజీ రూమర్స్ నిజమేనని ఆయన సంబంధీకులు కొందరు ధ్రువీకరించారట. త్వరలోనే దీనిపై అధికారికంగా ప్రకటన చేస్తారని సమాచారం. మరి, 41 ఏళ్ల శింబు ఇకనైనా తన బ్యాచ్‌లర్ లైఫ్‌కి ఫుల్‌స్టాప్ పెడతారేమో చూడాలి. అటు ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. అయితే శింబు ఏ తెలుగు హీరో కూతుర్ని పెళ్లి చేసుకుంటున్నాడనేది మాత్రం తెలియరాలేదు. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker